ఆర్జీవి ముందు పవన్ కళ్యాణ్ మరి వెనుక?
విభాగం: సినిమా వార్తలు
-pawan-kalyan-in-front-of-rgv-and-behind_g2d

నేను సినిమాలు కేవలం ప్రేక్షకుల వినోదం గురించి మాత్రమే తీస్తాను అంటూ ఎన్నో కాంట్రవర్సీ సినిమాలు చేస్తున్న రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై సినిమా అందులో అతని జీవితం గురించి చెబుతూ మరో కాంట్రవర్సీ న్యూస్ ను జనాల్లోకి విడిచిపెట్టారు దర్శకుడు ఆర్జీవి.

నేను చేసే ప్రతీ  సినిమా కు కాంట్రవర్సీ ను నేనే క్రియేట్ చేసుకుంటాను . ఆ కాంట్రవర్సీ ద్వారా నా సినిమాను అడ్వటైజ్మెంట్ చేసుకుంటాను. అలా ప్రతి సినిమాకు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు వచ్చేటట్లు చేసుకుంటాను అలాగే పవన్ కళ్యాణ్ సినిమా చేశాను ఆ సినిమాకు ఈ కరోనా టైం లో డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ట్రైలర్ కు 25 రూపాయలు పెట్టాను కానీ ఆ ట్రైలర్ ఎవరో నా కంటే ముందే రిలీజ్ చేయడం జరిగింది అని ఒక ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ తెలియజేశారు. 

కానీ మరికొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది రాంగోపాల్ వర్మ ను ఎవరో  వెనుకనుంచి నడిపిస్తున్నారని , ఏదో పొలిటికల్ పార్టీ కూడా వెనక ఉంది అని , మరి కొంత మంది పవన్ అభిమానులు వైసిపి పార్టీ ఆర్జివి వెనుక ఉంది అని కరాఖండిగా చెబుతున్నారు . 

మరి కొంతమంది రాజకీయ ప్రముఖులు మాట్లాడుతూ ఆర్జివి వెనుక వైసీపీ పార్టీ ఉంది కాబట్టే వైసిపికి అనుకూలంగా కమ్మ రాజ్యం లో కడప రెడ్డిలు దీనినే అమ్మ రాజ్యంలో కడప రెడ్లు గా పేరు మార్చి విడుదల చేశారు అనుకోండి.  తరువాత చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ వైసీపీకి సపోర్ట్ గా ఉండే లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా కూడా విడుదల చేశారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్న పవన్ కళ్యాణ్ పై ''పవన్ కళ్యాణ్'' అనే సినిమా తీశాడు ఇవన్నీ చూస్తుంటే ఆర్జివి వెనుక రాజకీయ పార్టీ ఉన్నట్లు ఉంది అని రాజకీయ పండితులు అనుకుంటున్నారు . 

అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ కోడి కత్తి వ్యవహారం జగన్ బాబాయి వివేక హత్య ఈ రెండూ కూడా సునామి సృష్టించాయి మరి వీటిపై  ఎందుకు ఆర్జివి సినిమాలు తీయడం లేదు , ఆర్జివి వెనుక వైసీపీ లేదు అని నిరూపించాలి అంటే వీటిపై కూడా సినిమా తీసి డబ్బులు సంపాదించు కోవాలి కదా అని పవన్ అభిమానులు ఆర్జివి కి కామెంట్లు పెడుతున్నారు.

23 Jul, 2020 0 496
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved