100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న రంగస్థలం
విభాగం: సినిమా వార్తలు
100-days-complete-for-rangasthalam_g2d

ఇంతకుముందు సినిమాల విజయాల్ని వంద రోజుల సెంటర్లతోనే కొలిచేవాళ్లు. ఎన్ని ఎక్కువ కేంద్రాల్లో వంద రోజులు ఆడితే అంత గొప్ప. కానీ ఆ తర్వాత రోజుల లెక్కలు పోయాయి. కలెక్షన్ల లెక్కలే సినిమా విజయానికి ప్రామాణికం అయ్యాయి. నెమ్మదిగా శతదినోత్సవాలు.. అర్ధశతదినోత్సవాల గురించి మాట్లాడ్డం మానేశారు. 

50 రోజులనో.. వంద రోజులనే అంటే విడుదలై అప్పటికి అన్ని రోజులు అయిందని అనుకోవాలి తప్ప ఆడిన కేంద్రాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ఈ రోజుల్లో కూడా ఒక సినిమా ఏకంగా 15 కేంద్రాల్లో వంద రోజులు ఆడేసి సంచలనం సృష్టించింది. ఇది అభిమానులే వెనుకండి బలవంతంగా ఆడించినట్లు ఆడిన సినిమా తరహా కాదు. జెన్యూన్‌గానే ‘రంగస్థలం’ వంద రోజుల పాటు ఆడింది. 

అయితే గియితే చివరి ఒకట్రెండు వారాలు సినిమాను నామమాత్రంగా నడిపించి ఉండొచ్చేమో కానీ.. చాలా రోజుల పాటు సినిమా మంచి షేర్ తెచ్చింది. డెఫిషిట్ లేకుండా నడిచింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని మరో 14 కేంద్రాల్లో ‘రంగస్థలం’ 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది ఈ రోజుతో. మెజారిటీ కేంద్రాలు ఆంధ్రా ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ ఏరియాలో గాజువాక (వైజాగ్), అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు సెంటర్లలో ఈ చిత్రం వంద రోజులాడింది. 

రాయలసీమలో ఆదోని, హిందూపురంల్లో సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలంగాణలో హైదరాబాద్ కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ల్లోనూ శతదినోత్సవం జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమాతో భారీ లాభాలు అందుకున్న బయ్యర్లు చాలా సంతోషంగా శత దినోత్సవ వేడుకలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి సెకండ్ షోకి అన్ని కేంద్రాల్లోనూ మెగా అభిమానులు రచ్చ రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు

 

SOURCE:GULTE.COM

08 Jul, 2018 0 665
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved