ఇక్కడ మహేష్‌తో.. అక్కడ విజయ్‌తో
విభాగం: సినిమా వార్తలు
after-mahesh-babu-kiara-advani-to-romance-vijay_g2d

తెలుగులో తొలి సినిమాకే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో పని చేసే అవకాశం రావడమంటే మాటలు కాదు. ఈ అరుదైన అవకాశాన్నే అందుకుంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఆమె బాలీవుడ్లో ఇంకా స్టార్ ఇమేజ్ సంపాదించుకోలేదు. అయినా మహేష్‌తో పని చేసే అవకాశం దక్కింది. ‘భరత్ అనే నేను’ హిట్టవడం, అందులో కియారా అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ కియారా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో మరో భారీ సినిమాకు కూడా ఆమెను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హిందీలో కరణ్ జోహార్ నిర్మించే ‘గుడ్ న్యూస్’ అనే భారీ ప్రాజెక్టులో కియారా అవకాశం దక్కించుకుంది. తాజాగా కియారాకు ఇంకో పెద్ద సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం.

తమిళ సూపర్ స్టార్ విజయ్ 63వ సినిమాలో కియారే కథానాయిక అంటున్నారు. తనతో ‘తెరి’.. ‘మెర్శల్’ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ దర్శకత్వంలో విజయ్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘సర్కార్’లో నటిస్తున్న విజయ్.. తర్వాతి ప్రాజెక్టును అట్లీకే కమిటయ్యాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించబోతోంది. ఇందులో విజయ్‌కి జోడీగా కియారాను ఎంపిక చేసినట్లు తమిళ మీడియా చెబుతోంది. తెలుగులో తొలి సినిమాకే మహేష్‌తో జత కట్టి.. తమిళంలో విజయ్ పక్కన అరంగేట్రం చేసే అవకాశం అందరికీ రాదు. ఈ వార్తే నిజమైతే కియారా మామూలు లక్కీ కాదనే చెప్పాలి. ‘మెర్శల్’కు సంగీతం అందించిన ఎ.ఆర్.రెహమానే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తాడట. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.

 

SOURCE:GULTE.COM

06 Aug, 2018 0 340
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved