అకీరా హర్టయ్యింది అందుకు కాదు: రేణు
విభాగం: సినిమా వార్తలు
akhira-upset-renu-desai-responds_g2d

గతకొన్నిరోజులుగా సినీ అభిమానుల నుంచి సినీ పెద్దల వరకు అందరు పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండో వివాహం గురించిన అప్‌డేట్స్‌ మీద విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్విట్టర్‌లో పవన్‌ అభిమానులు రేణుని బెదిరిస్తూ,హెచ్చరికలు చేస్తూ దూషిస్తుండటంతో ఆమె ఇక సహనం నశించి తన ట్విట్టర్‌ ఖాతాలను కూడా డీయాక్టివేట్‌ చేసింది. అయినా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోనే ఉంది. 

దాంతో పవన్‌ అభిమానులు ఆమెని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫాలో అవుతూ ఉన్నారు. తాజాగా ఈమె పవన్‌ ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియాలో పలు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతూ, సెహభాష్‌ అనిపిస్తోంది. తాజాగా ఓ నెటిజన్‌ మీకు పెళ్లయిన తర్వాత కూడా పవన్‌తో టచ్‌లో ఉంటారా? అని ప్రశ్నించారు. నిజానికి ఎందరి మదిలోనే మెదులుతున్న విషయాన్నే ఆ నెటిజన్‌ ఆమెని ప్రశ్నించాడు. దీనికి రేణు సమాధానం ఇస్తూ పవన్‌తో ఖచ్చితంగా టచ్‌లో ఉంటాను. ఎందుకంటే అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకు పవన్‌ కళ్యాణే తండ్రి. పిల్లల కోసమైనా ఆయనతో టచ్‌లో ఉండాల్సిందే. స్కూళ్లకు సెలవలు ఇచ్చినప్పుడు, ఏవైనా వేడుకలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు వారు ఆయన వద్దకు వెళ్తారని స్పష్టం చేసింది. దీంతో పలువురి అనుమానాలకు రేణు దేశాయ్‌ క్లారిటీ ఇచ్చింది. 

ఈ విషయం విని పవన్‌ ఫ్యాన్స్‌ బాగానే రిలాక్స్‌అయ్యారు. ఇక ఇటీవల అకీరానందన్‌ తన తండ్రి విజయవాడలో అద్దెఇంట్లో గృహప్రవేశం చేసిన సందర్భంగా అకీరాకి రేణు రెండో వివాహం ఇష్టం లేదని అతను హర్ట్‌ అయ్యాడని వార్తలు వచ్చాయి. దానిపై రేణు స్పందిస్తూ, నిజమే అకీరా హర్ట్‌ అయ్యాడు. అయినా అది నా పెళ్లి విషయంలో కాదు. నాపెళ్లి మెనూలో పన్నీర్‌ బటర్‌ మసాలా లేనందుకు అని సమాధానం చెప్పింది. తాజాగా ఆమె మరోసారి అకీరా విషయంపై స్పందిస్తూ అకీరా పరిణతి చెందిన టీనేజర్‌ అని, తనరెండో పెళ్లికి వాడి అంగీకారం ఉందని రేణు స్పష్టం చేసింది. 

కేవలం వీరాభిమానం కలిగిన 10శాతం మంది నుంచే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని, మిగిలిన వారంతా పెద్ద మనసుతో తన నిర్ణయాన్ని అంగీకరించి మద్దతుగా నిలిచారని, తనకు శుభాకాంక్షలు తెలిపారని, అలాంటి వారందరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. 

 

SOURCE:CINEJOSH.COM

30 Jun, 2018 0 376
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved