'కవాతు'కు రంగం సిద్ధం..
విభాగం: రాజకీయ వార్తలు
all-set-for-kavathu_g2d

యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు ధవళేశ్వరం బ్యారేజి మీద కవాతు నిర్వహించనున్నారు.

ఈరోజు జరగబోయే కవాతుకు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేయగా పవన్ కళ్యాణ్ గారి రాక కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి ఈ కవాతుకు జనసైనికులు మరియు అభిమానులు, ప్రజలు హాజరవనున్నారు. కొన్ని లక్షల మంది ఈ కవాతుకు హాజరయ్యే వీలు ఉన్నందువలన ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పార్కింగ్ మరియు ఇతర ప్రదేశాలపై జనసేన నాయకత్వం ద్రుష్టి సారించింది. గత కొన్ని రోజుల నుండి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది, జనసేనుడికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు మహిళలు, వృద్దులు, పిల్లలు, జనసైనికులు రంగం సిద్ధం చేసుకున్నారు. అభిమానులు మరియు జనసైనికుల క్షేమమే నాకు ప్రథమం, అందరూ జాగ్రత్త వహించాలని పవన్ కళ్యాణ్ గారు జనసైనికులను కోరిన విషయం మనకి తెలిసిందే...కావున ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుని కవాతులో పాల్గొనవల్సిందిగా మనవి.  

 

 

 

SOURCE:JANASENA.ORG

15 Oct, 2018 0 306
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved