నాకు స‌ర్వ మతాలూ స‌మాన‌మే - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
all-the-religions-are-equal-for-me-says-pawan_g2d

'త‌న‌ను తాను త‌గ్గించుకున్న‌వాడే హెచ్చింప‌బ‌డును' అని చిన్న‌ప్పుడు బైబిల్ లో చ‌దివాన‌ని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ గారు తెలిపారు.  పశ్చిమగోదావరి జిల్లాలో అతిపెద్ద చర్చిగా పేరొందిన భీమ‌వ‌రం రూపాంత‌ర దేవాలయాన్ని ఆదివారం ఉద‌యం సంద‌ర్శించి ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు.. ప్రేమ‌, శాంతి, స‌హ‌నం, క్ష‌మాగుణం కరుణామయుడు మ‌న‌కి నేర్పిన పాఠాల‌ని, వాటి నుంచి అంద‌రూ నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. మా కుటుంబం స‌ర్వ‌ మ‌తాల‌ను గౌర‌విస్తుంద‌ని, అందుకే మా పూజ గ‌దిలో భ‌గ‌వ‌ధ్గీతతో పాటు బైబిల్ కూడా ఉంటుంద‌ని తెలిపారు. స‌ర్వ‌ మ‌తాల‌ను గౌర‌వించేవాడిని కాబట్టే నా కూతురికి పొలేనా అని క్రిస్టియ‌న్ పేరు పెట్టాన‌న్నారు.

శౌరీలు అనే ఓ కిస్ట్రియ‌న్ టీచ‌ర్ త‌న‌కు ఇంగ్లీషు పాఠాల‌తోపాటు దేశ‌భ‌క్తిని నూరిపోశారని చెప్పారు.  ఏసులోని క్ష‌మాగుణం, స‌హ‌నం శౌరీలు మేడం చెప్పారని వెల్ల‌డించారు. ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు అనంత‌రం పవన్ కళ్యాణ్ కు చర్చ్ ఫాదర్ దీవెనలు అందించారు. శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ చర్చ్ కు వచ్చారని తెలుసుకున్న అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

 

SOURCE:JANASENA.ORG

13 Aug, 2018 0 371
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved