జగన్ కేసుల విషయంలో జేడీ పై సంచలనం రేపుతున్న ఆరోపణలు
విభాగం: రాజకీయ వార్తలు
allegations-gone-viral-on-ex-jd-lakshmi-narayana_g2d

మాజీ సిబిఐ అధికారి వివి లక్ష్మీ నారాయణ పేరు ఆంధ్ర రాష్ట్రంలో తెలీని వారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో జేడీ వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా ఆయన ఇరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున విశాఖపట్నం నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్నారు.ఇప్పటి వరకు జేడీ పై ఎలాంటి వివాదాస్పద మచ్చలు లేవు.

కానీ ఈ రోజు ఒక న్యూస్ ఛానెల్లో నిర్వహించిన డిబేట్ లో బీజేపీ కి చెందిన నేత రఘురాం చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద ధుమారాన్నే రేపుతున్నాయి.జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కీలక పాత్ర పోషించిన మహిళా ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి విషయంలో జేడీ వ్యవహరించిన తీరుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.ప్రస్తుతం ఆమె ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నారో కూడా అందరికీ తెలిసినదే.జగన్ పై కేసులు నడుస్తున్న సమయంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి పై జేడీ చెయ్యి చేసుకున్నారని ఆ విషయాన్ని తనకి వారి పోలీసు శాఖకు చెందిన ఒక అధికారే తెలియజేసారని రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి.

ఇది మాత్రం రాజకీయ శ్రేణుల్లో పెద్ద ఎత్తున వైరల్ టాపిక్ అవుతుందని దీనిని ఇప్పుడప్పుడే వదిలే సమస్య లేదని బీజేపీకి నేత అయినటువంటి రఘురాం చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎంత వరకు నిజముందో తెలిసే వరకు ఈ టాపిక్ కి వదిలేది లేదు అని ఆ ఛానెల్ ప్రతినిధి వెల్లడించారు.ఏది ఏమైనా ఇప్పుడు రఘురామ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాలలో పెద్ద షాకే అని చెప్పాలి.దీనిపై జేడీ ఎలాంటి వివరణ ఇస్తారో కూడా వేచి చూడాలి.

 

 

17 Apr, 2019 0 320
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved