అరుంధతి సినిమా ఇప్పటికే మనకళ్ళ ముందే ఉన్నట్లు అనిపిస్తుంది.దీనికి కారణం విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనూసూద్. దీనితో సోనూసూద్ కొట్లలో ప్రేక్షకుల మన్నలను పొంది స్టార్ యాక్టర్ గా మారిపోయాడు.
అలాగే రీల్ లైఫ్ లో మాత్రమే విలన్ గా నటించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారిపోయాడు. సోనూసూద్ కరోనా పై యుద్ధం చేస్తూ వలస కార్మికులను తన సొంత డబ్బులతో వాళ్ళ స్వస్థలాలకు బస్ లు పై పంపించాడు.అలాగే లాక్ డౌన్ సమయంలో ఫుడ్ లేని వాళ్లకు ఫుడ్ పెట్టాడు. వీటితో పాటు కరోనా పై పోరాడుతున్న వైద్యసిబ్బందికి సోనూసూద్ ముంబాయి లో జుహు ప్రాంతంలో ఉన్న తన హోటల్ ను ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ పనులన్నీ సోనూసూద్ తన మంచి మనసుతో చేసాడు అని ప్రజలు అంటున్నారు. అలాగే ఈ మధ్యే ఒక పుస్తకాన్ని కూడా రాసి అందులో “వలస కార్మికులతో నా అనుభవం” అంటూ తన పుస్తకాన్ని విడుదల చేసిన విషయం కూడా మనకు తెలుసు.
ఒక స్టార్ నటుడు, ఒక స్వతంత సమరయోధుడు,ఒక క్రీడాకారుడు,ఒక పొలిటిషయన్ ఇలా అనేక మంది గురుంచి బయోపిక్స్ వస్తున్నాయి.అయితే బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు సోనూసూద్ బయోపిక్ తీస్తాము అంటూ అతన్ని కలవడంతో దీనికి సోనూసూద్ స్పందిస్తూ “నా జీవితం పై తీయబోయే బయోపిక్ మూవీ లో నేనే నటిస్తాను” ఎందుకంటే నా లైఫ్ గురుంచి నా కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కదా! అని సమాధానం ఇచ్చారు.