కాబోయే భర్తకు ఒక రోజంతా క్లాస్
విభాగం: సినిమా వార్తలు
an-all-day-class-for-a-future-husband_g2d

కేవలం పవన్ వ్యవహార శైలి వల్లనే అతడితో విడాకులు తీసుకున్నానని ప్రకటించి సంచలనం సృష్టించిన రేణుదేశాయ్.. తన కాబోయే భర్త వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. పెళ్లి చేసుకున్న తర్వాతే తన భర్త ఎవరనే విషయాన్ని చెబుతానంటోంది. పెళ్లి చేసుకునే ప్రాసెస్ లో భాగంగా తన భర్తకు ఓ రోజంతా క్లాస్ తీసుకున్నానని చెబుతోంది రేణుదేశాయ్.

"ఆయన చాలా మెచ్యూర్డ్. నా బ్యాక్ గ్రౌండ్ తెలిసి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఆయనకు తెలుసు. ఒక రోజు ఆయన్ని కూర్చోబెట్టి, రోజంతా క్లాస్ తీసుకున్నాను. నా బ్యాక్ గ్రౌండ్ ఇది, ఇలాంటి సమస్యలు ఉంటాయి. భవిష్యత్తు ఇలా ఉంటుంది.. అని మొత్తం చెప్పేశా." 

ఏ అబ్బాయి అయినా తనను మాత్రమే అంగీకరించకూడదని.. టోటల్ ప్యాకేజీగా తనను అంగీకరించాలని అంటోంది రేణుదేశాయ్. లైఫ్ లో ఇది మాత్రమే కావాలి, ఇది యాక్సెప్ట్ చేయను అంటే కుదరదని, తన గతం, తన పిల్లలతో పాటు మొత్తంగా అంగీకరించాడు కాబట్టే అతడ్ని పెళ్లి చేసుకుంటున్నానని తెలిపింది. 

"అసలు ఇదంతా పిల్లల కోసమే. పిల్లల వల్లే పెళ్లి చేసుకుంటున్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణం పిల్లలు. పిల్లలకు ఆయనంటే చాలా ఇష్టం. ముందు పిల్లలు ఒప్పుకున్న తర్వాతే నేను ఒప్పుకున్నాను. ఆయన చాలా సైలెంట్ అండ్ కూల్. అందుకే అకిరా, ఆద్య ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు ముగ్గురూ చాలా క్లోజ్ ఉన్నారు. నేనే బయట ఉన్నట్టుంది." 

పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో ప్రస్తుతానికి తన కాబోయే భర్తతో పూర్తిగా లవ్ లో పడలేదని, ఏదో ఒక రోజు పూర్తిగా లవ్ లో పడతానని అంటోంది.

"నేను అతడితో పూర్తిగా లవ్ లో పడిపోయానని చెప్పను. ఎందుకంటే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అందుకే ప్రేమ ఇంకా పూర్తిగా కలగలేదు. బహుశా, ఏదో ఒక రోజు ఆయనతో ప్రేమలో పడతానేమో. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు పూర్తి మనశ్శాంతిని ఇస్తున్నాడు." 

పెళ్లయిన తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని, ఆ తర్వాత మళ్లీ కెరీర్ ను కొనసాగిస్తానంటోంది రేణుదేశాయ్. పెళ్లి తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉంది

 

SOURCE:GREATANDHRA.COM

08 Jul, 2018 0 339
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved