ప్రజల ఆగ్రాహాన్నిపసిగట్టిన భాజపా నాయకులు?
విభాగం: రాజకీయ వార్తలు
andhra-bjp-leaders-trying-to-quit-party_g2d

సమైక్యరాష్ట్రాన్ని రెండుగా విడదీసిన తర్వాత కష్టాలలో మునిగిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని అన్నీ పార్టీలు హామీ ఇచ్చాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరిన్నీ ఎక్కువ హమీలు గుప్పించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన కష్టాలు తీరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు.

అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయినా ఏ హామీలు నెరవేర్చేలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, హైదారబాదులోనూ, తెలంగాణలోని అన్నీ జిల్లాలలోను ఉన్న ఆంధ్ర సెటిలర్లను భారతీయ జనతా పార్టీ పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశంతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీపై యుద్దం ప్రకటించాయి. దీంతో తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రులు భారతీయ జనతా పార్టీ పట్ల రగిలిపోతున్నారు.

ప్రజల ఆగ్రాహాన్నిపసిగట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. సెటిలర్లకు అన్యాయం జరుగుతోందంటూ వారిని వంచిస్తున్నారంటూ మాజీ ఎమ్మేల్యే కాట్రగడ్డ ప్రసూన, ఆమె కుమార్తే బిజేవైఎం నాయకులరాలు అంబికా క్రుష్ణ చౌదరి బిజేపీకి రాజీనామ చేసారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రులను అవమానిస్తోందంటూ మండిపడ్డారు.

వారిబాటలోనే మరికొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికి వెళ్లినా అవమానం ఎదురవుతోంది. ప్రజలు వారిని ఏహ్యభావంతో చూస్తున్నారు. కొన్నిచోట్ల నాయకులను అవమానిస్తున్నారు కూడా.

ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సహాయమూ చేయాని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటూనిలదీస్తున్నారు. ఏ ఒక్క రంగంలోను కనీస అభివ్రుద్దిని కూడా చూపని బిజేపీ పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న బిజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీని వీడాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజేపీ శాసనసభా పక్షనాయకుడు విష్ణుకుమార్‌ రాజు బిజేపీని వదిలేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.

తన అనుచరులతోను, కార్యకర్తలతోను విష్ణుకుమార్ రాజు ఇటీవలే కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు పార్టీని వీడాలంటూ ఆయనకు సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. జగన్ పట్ల ప్రజలలో ఆదరణ పెరిగిందని ఆ పార్టీలోకి మారితే మంచి జరుగుతుందని సూచించినట్లు చెబుతున్నారు.

విష్ణుకుమార్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతోను, జగన్‌తోను టచ్‌లో ఉన్నారు.జగన్ విశాఖ పర్యటన సందర్భంగా విష్ణుకుమార్ రాజు ఆయనను కలిసే అవకాశం ఉంది. విష్ణుకుమార్ రాజు   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనతో పాటు మరికొందరు కీలక నాయకులు కూడా కమలానికి గుడ్‌బై చెప్పి జగన్ వెంట నడిచే అవకాశం ఉంది.

 

 

SOURCE:GULTE.COM

22 Aug, 2018 0 338
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved