సన్నీలియోన్ బయోపిక్ పై మరో వివాదం
విభాగం: సినిమా వార్తలు
another-controversy-over-sunnyleaf-biopic_g2d

ప్రసారానికి ముందే వివాదాస్పదమౌతోంది సన్నీలియోన్ బయోపిక్. "కరణ్ జీత్ కౌర్-ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్" పేరిట రేపట్నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో భారతీయ మూలాల్ని తప్పుగా చూపించారంటూ ఇప్పటికే ఓ మరాఠా హిందూ సంస్థ విమర్శలు చేయగా.. తాజాగా గురుద్వార కమిటీ కూడా మరో కొత్త అభ్యంతరాన్ని లేవనెత్తింది.

సన్నీలియోన్ బయోపిక్ టైటిల్ లో 'కౌర్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తోంది శిరోమణి గురుద్వార ప్రతిబంధక్ కమిటీ. సిక్కు మతానికి చెందిన ఈ పదాన్ని వెబ్ సిరీస్ టైటిల్ లో వాడడం తమకు ఇష్టంలేదంటూ ప్రకటించింది.

సన్నీ లియోన్ తన జీవితంలో ఎప్పుడూ సిక్కు గురువులు చెప్పిన పాఠాల్ని వినలేదని, సిక్కు సిద్ధాంతాలు, పద్ధతుల్ని పాటించలేదని, కాబట్టి కౌర్ అనే పదాన్ని వెబ్ సిరీస్ టైటిల్ లో వాడడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కమిటీ ప్రకటించింది.

అయితే ఈ వివాదంపై సదరు వెబ్ ఛానెల్ (జీ5)కు కమిటీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. కాబట్టి తాము ఈ వెబ్ సిరీస్ ను ప్రసారం చేసి తీరతామని అంటోంది జీ గ్రూప్. మరోవైపు ఈ వివాదంపై స్పందించడానికి సన్నీ లియోన్ కూడా నిరాకరించింది. రేపట్నుంచి నా కళ్లతో నా బయోగ్రఫీని చూడండి అని మాత్రమే ట్వీట్ చేసింది సన్నీ

 

SOURCE:GREATANDHRA.COM

15 Jul, 2018 0 357
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved