వీళ్లిద్దరి కోసం వాళ్లిద్దరూ వస్తారా
విభాగం: సినిమా వార్తలు
are-they-both-coming-for-them_g2d

నీహారిక.. సుమంత్ అశ్విన్... వీళ్లిద్దరూ మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తిప్పలు పడుతున్న వారే. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు. ఇండియన్ సినిమాకు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ఫార్ములా అయిన పెళ్లి కథతో హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేస్తున్నారు. 

హ్యాపీ వెడ్డింగ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ ట్రయిలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై బజ్ పెంచేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయాలని ఫిలిం మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 21న హైదరాబాద్ లోనే ఈ ఈవెంట్ జరగనుంది.  ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్లు వచ్చే అవకాశముంది. నీహారిక కోసం మెగాస్టార్ చిరంజీవి అటెండయ్యే అవకాశముంది. మెగా హీరోల్లో అందరి ఫంక్షన్లకు వీలైనంతవరకు అటెండవుతున్న మెగా స్టార్ కూతురి సినిమా ఫంక్షన్ కు రావడానికి సుముఖంగానే ఉన్నాడని తెలుస్తోంది.

మరోవైపు హీరో సుమంత్ అశ్విన్ కోసం బాహుబలి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హ్యాపీ వెడ్డింగ్ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇది హీరో ప్రభాస్ కు సొంత సంస్థలాంటిదే. అందుకే ఈవెంట్ కు గెస్ట్ గా ప్రభాస్ ను పిలుస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయితే హ్యాపీ వెడ్డింగ్ కు అంత ప్రయోజనం ఉంటుంది. అది ఈ ఇద్దరు గెస్టులు రావడంపై ఆధారపడి ఉంటుంది. మరి వస్తారా

 

SOURCE:GULTE.COM

19 Jul, 2018 0 355
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved