బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూ
విభాగం: సినిమా వార్తలు
bellamkonda-sai-srinivas-interview_g2d

శ్రీవాస్ దర్శత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ , పూజా హెగ్డే జంటగా అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈనెల 27 న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానున్న సంధర్బంగా చిత్ర హీరో సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంది?

మొదట నేను ‘జయ జానకి నాయక’ రిలీజ్ కాకముందే శ్రీవాస్ గారు నాకు ఈ కథ చెప్పారు. పంచభూతాలతో ఇలా స్క్రిప్ట్ రాయడం అంటే నిజంగా డైరెక్టర్ గారికి హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఇంత గొప్ప స్క్రిప్ట్ ని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లు మంచి స్క్రీన్ప్లే ఫార్ములాతో రాసుకొచ్చారు. అలానే ఏదైతే కథ చెప్పారో, అదేమాదిరి స్క్రీన్ పై కూడా అంతే గొప్పగా చూపించారు.

సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది?

పంచభూతాలతో చేసిన ఈ రకమైన స్క్రిప్ట్ కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్ లో కూడా ఈ రకమైన కాన్సెప్ట్ నిజంగా కొత్తది అని చెప్పవచ్చు. ఈ సినిమా తరువాత ఈ కాన్సెప్ట్ పై మరిన్ని సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను.

సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయా?

ఉంటాయండి కాని చాలా తక్కువ పోర్షన్ మాత్రమే, ఎక్కువగా రియలిస్టిక్ గానే సీన్లు తీసాము. సినిమా ఒకరకంగా ఈ జెనరేషన్ వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలబడుతుంది అని నమ్ముతున్నాను..

సినిమా సోసియో ఫాంటసి కథా?

కాదు అలాంటిదేమి లేదు, జనరల్ సోషల్ మూవీ, బట్ పక్కా కమర్షియల్ సినిమా. ఒక కమర్షియల్ సినిమాకు ఉండవలసిన హంగులన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అలానే చెప్పాలనుకున్న పాయింట్ ని కూడా పక్క దారి పట్టించకుండా డైరెక్టర్ గారు చాల కష్టపడి సినిమాని తీశారు.

సినిమా కోసం హార్డ్ వర్క్ ఏమైనా చేశారా?

నిజంగా చాల ఎక్కువ చేయవలసి వచ్చింది, కొన్ని పెద్ద పెద్ద కొండా రాళ్ల మీద దూకడం, రిస్కీ డివైస్ చేయడం వంటివి ఈ సినిమాలో ఉంటాయి. అవన్నీ డూప్ లేకుండా నేనే చేశాను. ఇప్పటివరకు మా నాన్నగారికి తెలియదు. సినిమాలో దాదాపుగా చాల రిస్కీ షాట్స్ వున్నాయి అవి డూపు తో చేయించారు అనుకున్నారు. కానీ అవి కూడా నేనే సినిమాలో కృతకంగా ఉండకూడదని కష్టపడి చేశాను. కష్టపడి చేస్తేనే సక్సెస్ తప్పకుండ వస్తుందని నా నమ్మకం..

హీరో క్యారెక్టర్ సిక్స్త్ సెన్స్ తో కూడినది అని ప్రచారం జరుగుతోంది?

అటువంటిది ఏమి వుండదండి, మాములుగా అన్ని సినిమాల్లో లాగానే నార్మల్ కామం మం క్యారెక్టర్, అతనికి పవర్స్ లాంటివి ఏమి వుండవు.

ఈ సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?

మొత్తం నలుగురు విలన్లు ఈ సినిమాకి పని చేశారు. జగపతి బాబు గారు, రవికిషన్ గారు, అశుతోష్ రానా గారు, ఇక కన్నడలో ఫేమస్ విలన్ మధు గురు స్వామి గారు మా సినిమాలో చేయడం అదృష్టంఅనే చెప్పాలి. ఇక శరత్ కుమార్ గారు, మీనా గారు ఇలా అందరూ కూడా కథ విని వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పటినుండి ఇది హిట్ సినిమా అనే మాట్లాడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు.

ట్రైలర్ లో అఘోరాలు కనపడుతున్నారు ?
వున్నారండి బట్ చాలా చిన్న పోర్షన్ అండి. సినిమా వారి అవసరంవుంది. మీరు సినిమా చూస్తే అది మీకు అర్ధం అవుతుంది.

సినిమా సినిమాకి పేరు, మరియు బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు?

నా వంతు ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నాను. అందుకే ప్రతి సినిమాలోనూ కొత్త గా ట్రై చేస్తున్నాను. రాబోయే సినిమాలో పోలీస్ గా చేస్తున్నాను. రేంజి అనేది పెంచుకుంటూ వెళ్లడం మంచిదే కదా సర్, అందుకే జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. నా వంతు కృష్జి చేస్తున్నాను. నా నుండి కనీసం మినిమమ్ గ్యారంటీ సినిమా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.

సినిమాకి బడ్జెట్ పెరిగింది అంటున్నారు?

ఏ నిర్మాత అయినా హీరో స్థాయిని బట్టే బడ్జెట్ పెడతారు. ఏదో కొంచెం ఎక్కువ అవ్వొచ్చు తప్ప, మరీ ఎక్కువ ఎవరు పెట్టారు సర్. సినిమాకి సంభందించి శాటిలైట్, థియేట్రికల్, ప్రమోషన్స్ అన్ని కలిపే లెక్కేసుకుని సినిమాకి బడ్జెట్ పెట్టారు. అవికూడా లెక్కలోకి వస్తాయి కదండి.

ఒక నిర్మాత కొడుగ్గా ఒక సినిమా చేసేటపుడు దాని బడ్జెట్ మీద మీ ప్రభావం ఎంత ఉంటుంది?

నేనెప్పుడూ ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్స్ హీరోనే అండి. నేను సినిమాకి సంబంధించి జాగ్రత్తగానే ఖర్చు పెట్టండి అని నావంతు చెపుతుంటాను. అభిషేక్ గారు నీ స్పాన్ ని బట్టి సినిమాకి ఖర్చు పెట్టాను. నీ గురించి తెలుసునని అంటుంటారు. ఇదివరకు చేసిన నిర్మాతలు కూడా అలానే అంటుంటారు.

జయ జానకి నాయక చిత్రం లోలాగా ఇందులో హీరోయిజం సీన్స్ ఉంటాయా?

ఫస్ట్ సీన్స్ మరియు లాస్ట్ లో వచ్చే కొన్ని సీన్స్ సూపర్ గా ఉంటాయండి. అలానే కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

నలుగురు విలన్లతో అనుబంధం ఎలా వుంది?

నలుగురు కూడా చాల కోఆపరేటివ్ గా చేసారు. వాళ్లు ఇది మా సినిమా అని అనుకుని ఎంతో ఇన్వొల్వె అయి చేశారు. వాళ్ల నుండి నేను చాలా నేర్చుకున్నాను.

శ్రీవాస్ గురించి చెప్పండి ?

ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ కథ నిజానికి ఆయన ఏడేళ్ల ముందు రెడీ చేసారు. ఆయన నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన చేసిన గత సినిమాలు ఎలా ఆడాయి అనేది పక్కన పెడితే, ఈ సినిమా చేసేటపుడు ఒక పెద్ద డైరెక్టర్ తో పనిచేసిన ఫీలింగ్ నాకు కలిగింది. ఇదివరకు చిన్న లోపాలు ఉన్న సినిమాలు చేశారేమో కానీ, ఈ సినిమాతో ఆయన క్రెడిబిలిటీ అందరికి అర్ధం అవుతుందని నా నమ్మకం. ఒక్క ముక్కలో చెప్పాలంటే హి ఈజ్ అల్ట్రా జీనియస్

 

SOURCE:123TELUGU.COM

23 Jul, 2018 0 270
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved