చిన్న సినిమాకే భయపడితే ఎలా బెల్లంకొండ
విభాగం: సినిమా వార్తలు
bellekonda-is-a-small-movie_g2d

జయజానకీ నాయక సినిమా సరైన డేట్ దొరక్క ఇబ్బందిపడిందని, లేకుంటే మరో అయిదు లేదా పదికోట్ల కలెక్ట్ చేసివుండేదని, హీరో శ్రీనివాస్ ఫాదర్ బెల్లంకొండ సురేష్ ప్రగాఢ నమ్మకం. అందుకే ఈసారి తన కొడుకు సినిమాను, ఎంతవెనక్కు వెళ్లి అయినా సోలోగా విడుదల చేయించాలని ప్లాన్. అందుకోసమే అలా వెనక్కు వెనక్కు వచ్చారు.

కానీ 20న వేద్దాం అంటే లవర్ సినిమా అడ్డంపడింది. దిల్ రాజుతో కిందా మీదాపడి ఆఖరికి సాక్ష్యం సినిమాను 27కు జరిపారు. తీరాచేస్తే, ఇప్పుడు పెద్ద బ్యానర్ల అండ వున్న రెండు చిన్న సినిమాలు వచ్చిపడ్డాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అండతో చి.ల.సౌ, యూవీ సంస్థ అండతో హ్యాపీ వెడ్డింగ్ వచ్చాయి.

అన్నపూర్ణ చి.ల.సౌను బెల్లంకొండ కదపలేరు. కానీ కనీసం హ్యాపీ వెడ్డింగ్ ను అయినా వెనక్కు తోయాలని కిందామీదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దిల్ రాజుకు యూవీతో మంచి సంబంధాలు వున్నాయి. ఆయన చెబితే వాళ్లు వింటారు. అందుకని 3వ తేదీకి జరపమని అడుగుతున్నారట. వాళ్లు కాస్త మొహమాటంగా వున్నారని తెలుస్తోంది. కానీ ఆ సినిమా నిర్మాత ఎమ్ ఎస్ రాజు అటు ఇటుగా వున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇక్కడ ఇంకో సమస్య వుంది. దాదాపు లైన్లో వున్న సినిమాలు అన్నీ వెనక్కు వెనక్కు జరగాలి. బ్రాండ్ బాబు, గూఢచారి 3న వున్నాయి. వాటిని కూడా జరపాల్సి రావచ్చు. అయినా హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిన్న సినిమా, సుమంత్ అశ్విన్ లాంటి చిన్న హీరో సినిమాకు కూడా సాక్ష్యం సినిమా జంకితే ఎలా

 

SOURCE:GREATANDHRA.COM

12 Jul, 2018 0 406
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved