బికినీలో మతిపోగొడుతోన్న బాలీవుడ్ హీరోయిన్
విభాగం: సినిమా వార్తలు
bollywood-heroine-in-bikini_g2d

బాలీవుడ్ హీరోయిన్ ఎల్లీ అవ్ రామ్ గురించి సినీ ప్రేమికులకు పరిచయం అక్కర లేదు. బిగ్ బాస్ -7 షోలో పాల్గొన్న ఎల్లీ ఆ తర్వాత సల్లూ భాయ్ పుణ్యమా అంటూ బాగా పాపులర్ అయింది. సల్లూ భాయ్ తో స్వీడిష్ మోడల్ ఎల్లీ...పీకల్లోతు ప్రేమలో ఉందని - వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని వదంతులు కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే ....సల్లూ భాయ్ తో కలిసి ఎల్లీ....చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ సల్లూ భాయ్ తో బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు.....టూ పీస్ బికినీలో దిగిన హాట్ ఫొటోలతో  అభిమానులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఎల్లీ....ఆ తర్వాత బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎల్లీ మెల్లగా బాలీవుడ్ లో పాగా వేసింది. మిక్కీ వైరస్ - హౌస్ ఫుల్ 3 - నామ్ షబానా వంటి పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఎల్లీ....బీచ్ లో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. టూ పీస్ బికినీలో బీచ్ దగ్గర ...ఎల్లీ రచ్చ చేసిన ఫొటోలో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎల్లీ ఒంపు సొంపులకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆమె అందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు

 

SOURCE:TUPAKI.COM 

13 Jul, 2018 0 343
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved