
హైదరాబాద్ లో గల జనసేన పార్టీ కార్యాలయం నందు తూర్పు గోదావరి జిల్లా నుండి నూతనంగా పార్టీలోకి చేరిన నేతలతో జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :
* ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.
* పార్టీ నాది అని నేను ఎప్పుడూ ఆలోచించను, పార్టీ మనందరిది.
* నేను సినిమాలు చేసుండొచ్చు కానీ నా మనసంతా ప్రజలకు ఎదో చెయ్యాలని, దేశం కోసం ఎదో చెయ్యాలని అనిపించేది.
* మనుషులను భావజాలంతో కట్టెయ్యాలి, కులాలతో కాదు. దశాబ్దాలు అలోచించి జనసేన సిద్ధాంతాలను రూపొందించాం.
* రాజకీయం అవినీతి తో నిండిపోయింది. ఇలానే మనం వదిలేస్తే సమస్యలను పట్టించుకునేవారు ఎవరూ వుండరు.
* విశాఖ వెళ్లినప్పుడు మా దగ్గరకి ఎవరు రాలేదు, నువ్వు మాత్రం ఇక్కడికి రావడమే కాకుండా సమస్యలను వింటున్నావు అని అక్కడ ప్రజలు నాతో అన్నారు.
* రాజకీయాల్లో ఓర్పు, సహనం ఉండాలి. అవినీతి లేని పాలన అందించాలన్నదే నా లక్ష్యం.
* నాలుగు గోడల మధ్య ఉంటే సమస్యలకు పరిష్కారం దొరకదు, బయటకి వెళ్లి సమస్యలను తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
* 25 కోట్లు టాక్స్ కట్టే స్థోమత వుంది కానీ డబ్బుతో ఏం చెయ్యగలం ? డబ్బు ఉంటే విలాసవంతమైన జీవితం గడపొచ్చు కాని, మనసుకు నచ్చిన జీవితాన్ని గడపలేం. నేను చిత్తశుద్దిగా, త్రికరణశుద్ధిగా దేశం కోసం పనిచేయడానికి వచ్చా...
* చిన్నపాటి లాభాలకు నేను రాజకీయాలలోకి రాలేదు, రెండున్నర దశాబ్దాలు ఆలోచించి ప్రజలకు సేవ చేద్దాం అని నిర్ణయించుకున్నా.
* నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద నిలబడతాను. మన పార్టీ ఒక సరికొత్త పార్టీ, కావున కొన్ని కష్టాలు ఉంటాయి, వాటిని సమర్ధంగా ఎదుర్కొని ముందుకు సాగుదాం.
జనసేనలో చేరిన తూర్పుగోదావరి నాయకులు :
జనసేన సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులైన నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు మరియు యువత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలోకి చేరిన వారందరూ జనసేన పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రముఖ తూర్పు గోదావరి జిల్లా నాయకులు కందుల సురేష్ గారు, పంతం నానాజీ గారు కొత్తగా పార్టీలోకి చేరినవారిలో వున్నారు.
SOURCE:JANASENA.ORG