రెమిడిసివిర్ ప్రాణాలను కాపాడు తుందా?
విభాగం: జనరల్
can-remedicivir-save-lives_g2d

చివరి నెల రోజులు నుంచి అతి ఎక్కువగా వినిపిస్తున్న పేరు రెమిడిసివిర్ .. కరోనా వైరస్ చికిత్సలో భాగంగా అత్యవసర పరిస్థితులలో వాడే ఏకైక ఔషదం. కేవలం ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న కరోనా వైరస్ బాధితులకు మాత్రమే ఈ ఔషధం  ఇవ్వాలని దీని వాడకం వలన కాలేయం, మూత్రపిండాలు, గుండె వైఫల్యాల వంటి సమస్యలు తలెత్తవచ్చని ఐసీఎంఆర్ హెచ్చరించింది.
ఈ ఔషదాన్ని అతిగా వాడటం వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం మరియు రోగ నిరోధక వ్యవస్థపై ఈ వైరల్ ఔషదం (రెమిడిసివర్ ) యొక్క ప్రభావం ఉంటుంది అని ఐసీఎంఆర్ తెలియజేసింది.
 కాగా కరోనాపై రెమిడీసివిర్ ప్రభావం చూపుతుందని క్లినికల్ ట్రయల్స్ లో నిర్థారణ అయినా ఈ మందును వాడిన రోగి యొక్క పూర్తి సమాచారాన్ని భవిషత్తులో తెలుసు కొనే విధంగా భద్రపరచాలి అని ఐసీఎంఆర్ తెలియజేసింది.
       ఈ ఔషదాన్ని మన దేశీయ ఫార్మా కంపెనీలు అయిన సిప్లా - హెటిరో అందుబాటులోకి తెచ్చిన తరువాత కూడా మరణాలు రేటు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. దేశంలో గత 24 గంటలలో మొత్తం కేసుల సంఖ్య 28 707 కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 8.50 లక్షలను దాటింది. తాజాగా మరో 510 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 23522 కు చేరింది. మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో క్లినికల్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేక దృష్టిని సారించామని ఐసీఎంఆర్ సూచించింది.

14 Jul, 2020 0 364
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved