
విశాఖపట్నం ఈ మాట వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది సముద్రతీరం ఆహ్లాదకరమైన సముద్రతీరం కరోనాతో అలజడి చెందుతుంది అని ఎవరైనా అనుకుంటారు అనుకుంటారా ?
జగన్ సర్కార్ అమరావతిని రాజధానిగా కాదు అనుకుని విశాఖపట్నం వచ్చింది . ఇలా విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు విశాఖపట్నం విషయంలో గవర్నమెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ కరోనా విషయంలో విశాఖపట్నం ను జగన్ సర్కార్ గాలికి వదిలేసింది అంటూ టిడిపి పెద్దలు ఆరోపిస్తున్నారు .
అసలు కథలోకి వస్తే కరోనా మొదలైన చివరి నాలుగు నెలల నుండి అతి తక్కువగా కరోనా కేసులు , అతి తక్కువ కరోనా మరణాలు ఉన్న విశాఖ జిల్లా ఇప్పుడు చివరి 24 గంటల లో 1049 కొత్త కేసులు నమోదయ్యాయి . మిగతా 12 జిల్లాల లో అతి తక్కువ కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 325 కృష్ణ 151 విజయనగరం 107 వీటితో పోల్చుకుంటే విశాఖపట్నం లో అతి ఎక్కువ కేసులు నమోదు కావడం మొత్తం 54 మరణాలు సంభవించడం విశాఖ ప్రజలలో భయాందోళనలు మొదలయ్యాయి .
ఒకేరోజు 1049 కొత్త కేసులు రావడంతో విశాఖపట్నంలో పూర్తి కరోనా టెస్టులు చేస్తున్నారా లేక గవర్నమెంట్ కరోనా ను కట్టడి చేయలేక పోతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రజలలో విశాఖ జిల్లా ను పూర్తి లొక్డౌన్ గా ప్రకటించాలి అని కూడా మరికొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.