రాముడి పై నోరు పారేసుకున్న కత్తి
విభాగం: సినిమా వార్తలు
case-filed-on-kathi_g2d

సినీ విమ‌ర్శ‌కుడు క‌మ్ సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్ గా ఉంటే క‌త్తి మ‌హేశ్ పై కేసు న‌మోదైంది. రాముడ్ని దూషించార‌న్న ఆరోప‌ణ‌పై పోలీసుస్టేష‌న్ కు వ‌చ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఒక ఛాన‌ల్ లో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌త్తి మ‌హేశ్ ఫోన్ ఇన్ లో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా రాముడి మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. రామాయ‌ణం అనేది నాకొక క‌థ‌. రాముడు అనేవాడు ఎంత ఆద‌ర్శ‌వంతుడో.. అంత ద‌గుల్బాజీ అని తాను న‌మ్ముతాన‌ని.. ఆ క‌థ‌లో సీత బ‌హుశా రావ‌ణుడితోనే ఉంటే బాగుండేదేమో?.. ఆమెకు న్యాయం జ‌రిగి ఉండేదేమో?  అని తాను అనుకుంటాన‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హిందూ జ‌న‌శ‌క్తి నేత‌లు క‌త్తి మ‌హేశ్‌పై కేపీహెచ్ బీ పోలీస్ స్టేష‌న్ లో  ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప‌రిశీలించిన పోలీసులు.. క‌త్తి మ‌హేశ్ పై కేసు న‌మోదు చేశారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌చ్చే క‌త్తి.. త‌న వాద‌న‌తో త‌నను తాను స‌మ‌ర్థించుకునే వారు. రాముడిపై తాను చేసిన వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్థించుకునే క్ర‌మంలో మ‌రెన్ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేస్తారో చూడాలి.

 

SOURCE:GULTE.COM

30 Jun, 2018 0 669
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved