ఎస్వీఆర్ ను చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు
విభాగం: సినిమా వార్తలు
chandra-babu-praised-the-svr_g2d

లెజెండ‌రీ న‌టుడు, విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తి దివంగత ఎస్వీ రంగారావు(సామ‌ర్ల వెంక‌ట రంగారావు)శ‌త జ‌యంతి వేడుక‌లు నేడు ఘ‌నంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఉత్స‌వాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని....ఎస్వీఆర్ మేన‌ల్లుడు, ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఏలూరులో ఉన్న క‌ల‌ప‌ర్రు వై జంక్ష‌న్ లో ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం నాడు అట్ట‌హాసంగా జ‌రిగింది. 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎస్వీఆర్ ను చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఎస్వీఆర్ మ‌హాన‌టుడ‌ని, అటువంటి  నటులు లేరని....భవిష్యత్తులో రార‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఎస్వీఆర్ త‌ర‌హాలో  డైలాగులు చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాద‌ని అన్నారు. 


ఎన్టీఆర్ కు పోటీగా న‌టించిన ఏకైక న‌టుడు ఎస్వీఆర్ అని, వీరిద్ద‌రి కాంబినేషన్లో ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయని చెప్పారు. తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌స్సులో గొప్పన‌టుడిగా ఎస్వీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతార‌ని ఎస్వీఆర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీఆర్ మ‌న‌వ‌ళ్లు, బంధువులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీపరిశ్రమకు చెందిన వేణుమాధవ్, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, ఝాన్సీ తదితరులు హాజరయ్యారు. 12.5 అడుగుల ఎత్తు, 2 ట‌న్నుల బ‌రువు ఉన్న ఈ నిలువెత్తు కాంస్య విగ్ర‌హాన్ని ప్ర‌ముఖ శిల్పి రాజ్ కుమార్ వ‌డ‌యార్ రూపొందించారు. 

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కొత్త‌పేట‌లో ఈ విగ్ర‌హం త‌యారు చేశారు. మాయాబ‌జార్ సినిమాలో `ఘ‌టోత్క‌చుడి`పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ కాంస్య విగ్ర‌హాన్ని రూపొందించారు. గ‌ద‌పై చేయి పెట్టి ఠీవిగా నిలుచున్న ఘ‌టోత్క‌డి గెట‌ప్ లో ఉన్న ఎస్వీఆర్ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు బారులు తీరారు

 

SOURCE:GULTE.COM

04 Jul, 2018 0 379
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved