జ‌గ‌న్‌.. ప‌వ‌న్ ల‌ను ఏసుకున్న బాబు మాట‌ల్ని వినాల్సిందే!
విభాగం: రాజకీయ వార్తలు
chandrababu-slams-jagan-and-pawan_g2d

చంద్ర‌బాబును నాశ‌నం చేసేందుకు అవ‌స‌ర‌మైతే ఆంధ్రోళ్ల భ‌విష్య‌త్తును తాక‌ట్టు పెట్టేసే దుర్మార్గ‌మైన కుట్ర ఒక‌టి షురూ అయ్యింది. విభ‌జ‌న గాయంతో అల్లాడిపోతున్న ఏపీకి స్వ‌స్థ‌త చేకూర్చే ఔష‌ధం కంటే కూడా త‌మ స్వార్థ రాజ‌కీయాలే ప్ర‌ధాన‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ ను.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను ఉద్దేశించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఇవాల్టి రోజున ఏపీని ఆదుకోవ‌టానికి కాంగ్రెస్‌.. రాజీవ్ గాంధీ మిన‌హా మ‌రెవ‌రూ లేని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. వారి సాయం తీసుకోకుండా ఉండ‌టం అంటే.. కోట్లాది ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల్ని ప‌ణంగా పెట్ట‌ట‌మే. విభ‌జ‌న క‌ష్టాల్ని గ‌ట్టెక్కించేది బాబేన‌ని ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మిన వేళ‌.. వారి న‌మ్మ‌కాల్ని వ‌మ్ము చేయ‌కుండా ఉండాల్సిన బాధ్య‌త ఎవ‌రి మీద ఉంటుందంటే అది చంద్ర‌బాబు మీద‌నే. అలాంట‌ప్పుడు మోడీ లాంటోడు ఏపీకి ప్ర‌ధ‌మ శ‌త్రువుగా మారిన వేళ‌.. ఏపీ భ‌విష్య‌త్తు కోసం రాహుల్ తో క‌ల‌వ‌టం వ్యూహాత్మ‌క‌మే అవుతుంది త‌ప్పించి.. అదెంత‌మాత్రం న‌ష్టం చేసేది కాద‌న్న వాస్త‌వాన్ని మ‌ర్చిపోకూడ‌దు. 

ఏపీ భ‌విష్య‌త్తు కోసం కాంగ్రెస్ తో క‌లిసిన బాబుపై జ‌గ‌న్‌.. ప‌వ‌న్ లు విరుచుకుప‌డుతున్న వేళ‌.. వారి మాట‌ల దాడికి త‌గిన రీతిలో స‌మాధానం చెప్పారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. తాజాగా ఆయ‌న మాట్లాడిన మాట‌ల్లో ముఖ్య‌మైన అంశాల్ని ప్ర‌తి ఆంధ్రోడు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అవేమంటే..

‘‘రాష్ట్ర విభజన కష్టాల నుంచి తెలుగుదేశం మాత్రమే గట్టెక్కించగలదని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నాలుగున్నరేళ్లుగా కష్టపడి పని చేస్తున్నాను. 2019 ఎన్నికల్లోనూ టీడీపీని గెలిపిస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌-1 చేస్తా. కులాలు, మతాల పేరుతో వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పాలి"
 
‘‘నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను సాధించింది విశ్వసనీయతే. పదవుల కోసం ఆరాట పడలేదు. దేశం బాగుండాలన్న సంకల్పంతోనే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నా. త్వరలో మరికొన్ని పార్టీలను కలుస్తా. కేంద్రంపై పోరులో వెనుకాడేది లేదు. తెలంగాణలో మహా కూటమి కడితే మోదీకి వణుకు పుట్టింది.  బీజేపీతో జతకట్టిన కోడి కత్తి పార్టీ... రాష్ట్రాన్ని మోదీ చేతిలో పెట్టాలని చూస్తోంది"

"కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నించినందుకే టీడీపీపై బీజేపీ కక్ష కట్టింది. ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తోంది. అక్కడ మోదీ మాపై కత్తి దూస్తున్నా, ఇక్కడ ప్రతిపక్షం కోడికత్తి సాకు చూపినా భయపడేది లేదు. విభజన తర్వాతి పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం చేస్తారని, హామీలు అమలు చేస్తారని బీజేపీతో చేతులు కలిపాం.  కానీ మోదీ ఘోరంగా మోసం చేశారు"

"ప‌వ‌న్ మాటలకు అర్థంలేకుండా పోతోంది. నాడు అవినీతిని ప్రశ్నిస్తానని ప్రగల్బాలు పలికిన పవన్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఢిల్లీలో మోదీ స్క్రిప్ట్ రాసిస్తే స్వతహాగా నటుడైన పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో యాక్షన్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టామని మమ్మల్ని విమర్శిస్తున్న పవన్‌ నాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి? ఆయన బీజేపీని ఏనాడూ విమర్శించరు. ఎందుకంటే పవన్‌, జగన్‌లకు మోదీ అంటే భయం. కానీ నేను అలాంటి వాటికి భయపడేది లేదు"

 

 

 

 

SOURCE:GULTE.COM

05 Nov, 2018 0 336
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved