చినబాబు 3 రోజుల కలెక్షన్స్
విభాగం: సినిమా వార్తలు
chinababu-3-days-collections_g2d

తమిళ హీరో కార్తి, సయేష హీరో హీరోయిన్లుగా, పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చినబాబు’. కార్తికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అతని సినిమాలకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కాగా కార్తి మొదటిసారి రైతు పాత్రలో నటించిన ‘చినబాబు’ జులై 13న విడుదలైంది. ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శుక్రవారం డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులకు మొత్తం 2.74 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టుకోగలిగింది. ప్రస్తుతానికి ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో నడుస్తున్నప్పటికీ ఈ చిత్రానికి నిజమైన పోటీ మాత్రం ఈ వారాంతపు రోజుల్లోనే మొదలుకానుంది. మరి ఈ పోటీలో కార్తి బాక్స్ అఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి

 

SOURCE:123TELUGU.COM

16 Jul, 2018 0 349
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved