ఇంట గెల‌వ‌కుండానే ర‌చ్చ గెలుస్తావా ప‌వ‌న్?
విభాగం: రాజకీయ వార్తలు
comments-on-pawan-meeting-mayawati_g2d

ఆలూ లేదు చూలూ లేదు...కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్లుంది జ‌న‌సేన ప‌రిస్థితి. పార్టీ స్థాపించి నాలుగేళ్లు పూర్త‌వుతున్నా....ఇప్ప‌టికీ సంస్థాగ‌త నిర్మాణం అసంపూర్ణంగానే ఉన్నారు. అర‌కొర‌గా త‌ప్ప చెప్పుకోద‌గ్గ నాయ‌కులు లేరు. ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు, నియోజ‌వ‌ర్గ ఇన్ చార్జిల పై స్ప‌ష్ట‌త లేదు. తెలంగాణ‌లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో...అస‌లు చేస్తారో చెయ్య‌రో స్ప‌ష్ట‌త లేదు....ఇటువంటి ప‌రిస్థితుల్లో జ‌నసేన‌ ఇరు తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టి సారిస్తుంద‌ని అంతా అనుకుంటారు. కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ రూటే స‌ప‌రేటు. అందుకే  రొటీన్ కు భిన్నంగా ప‌వ‌న్....జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేశారు. ఈ క్ర‌మంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని క‌లిసేందుకు ప‌వ‌న్ నేడు ల‌క్నో వెళ్లారు. 

ఏ పార్టీ అయినా...ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వానుకుంటుంది. కానీ, ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేన మాత్రం ఇంట గెల‌వ‌కుండానే 'ర‌చ్చ‌' గెలిచి ర‌చ్చ‌ర‌చ్చ‌చేయాల‌నుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. జ‌న‌సేన జాతీయ స్థాయిలో ఎదుగుతానంటే....దానిని ఎవ‌రూ అడ్డుకోరు. కానీ, అస‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం బ‌లం, క్యాడ‌ర్ లేని జ‌న‌సేన‌....ఏకంగా జాతీయ రాజ‌కీయాల‌ను టార్గెట్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

అయితే, జాతీయ రాజకీయాల్లో కొందరు కీలక నేత‌ల‌తో ప‌వ‌న్ స‌న్నిహిత సంబంధాలు నెర‌పి ఏపీ, తెలంగాణ‌లో జనసేనను బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారేమోన‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేటి ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ తో పాటు కొంద‌రు విద్యావేత్త‌లు, మేధావులు , ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా లక్నో వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా  స‌పోర్ట్ తో తెలంగాణ బ‌రిలో దిగేందుకు ప‌వ‌న్ య‌త్నిస్తున్నారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా...ద‌ళిత ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌వ‌న్....బీఎస్పీతో పొత్తుకు రెడీ అయ్యార‌ని టాక్ వ‌స్తోంది.

 

 

 

 

SOURCE:GULTE.COM

25 Oct, 2018 0 325
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved