సినిమా వారసులను వదలని కరోనా మహమ్మారి
విభాగం: సినిమా వార్తలు
corona-epidemic-is-not-leaving-the-movie-heirs_g2d

అరటి పండు తింటే పన్ను విరగడం అంటే ఇదేనేమో..డాక్టర్ సర్ మా అబ్బాయి అరటి పండు తింటే పన్ను విరిగింది. ఏదైనా మార్గం చూపించండి కొత్త పన్ను రావటానికి. అరటి పండు తింటే పన్ను విరిగిన అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో, సినిమా లోకంలో సినిమా వారసుల పరిస్థితి అలా ఉంది ఏదేమైనా టాలీవుడ్ లో అదృష్టాన్ని పరిక్షుంచుకుందాము అని  వచ్చిన నటవారసుల పుత్రరత్నాలు వైరస్ దెబ్బకు ఏమీ కాని పరిస్థితులలో ఉన్నారు.
డైరెక్టర్స్ ఉన్నారు ఇంటిలో డబ్బులు ఉన్నాయి. ఇక హీరో గా సత్తా చాటేయడం ఒక్క పనే మిగిలింది అంటూ నట వారసుల పుత్రరత్నాలు అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ లోగా తానొకటి తలిస్తే దైవ మొకటి తలుస్తుంది అన్నట్లు ఊహించని పిడుగు వచ్చి కరోనా రూపంలో మీద పడింది. దీని పరిస్థితికి ఎన్నో పరిశ్రమలు మూతపడిపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ ఒకటి. ఎన్నో ఆశలతో మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకునే వారసుల పుత్రరత్నాల పై ఈ కరోనా వైరస్ ప్రభావం బాగా పడింది. ఈ వైరస్ ప్రభావం పడిన పుత్రరత్నాలు ఎవరో తెలుసుకుందాం. ఈ వారసులలో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్, బెల్లం కొండ ఫ్యామిలీ నుండి బెల్లం కొండ సాయి గణేష్, ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ మరియు పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి వారసుడు శివ కందుకూరి ఉన్నారు.
హీరో సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ప్రామిస్సింగ్ డెబ్యు మూవీ “ఉప్పెన” రిలీజ్ కు ముందర చిక్కుల్లో ఉంది.అలాగే ఇదే సినిమాకు సుకుమార్ శిష్యుడు డెబ్యుగా లక్ చెక్ చేసుకోబోతున్నాడు.అలాగే ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ వారసుడు సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే దానయ్య వారసుడు శ్రీవాస్ పరిస్థితి అలాగే ఉంది. వీరితో పాటు నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఓ హీరో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే, రాజుగారి సోదరుడు శిరీష్ తనయుడిని హీరోని చేస్తూ పలుకే బంగారమాయనే అనే సినిమా కూడా మధ్యలో నిలిచిపోయింది. అలాగే హీరో శ్రీకాంత్, శివాజీ వారసులు కూడా ఇలా ఈ కరోనా మహమ్మారికి బలి అయ్యారు.

21 Jul, 2020 0 287
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved