
ఒక వైరల్ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక ఆడపిల్లను.. తన తప్పేమీ లేకున్నా.. తన అధికారాన్ని ప్రదర్శించటానికి.. తన దౌర్జన్యాన్ని చూపేందుకు వ్యవహరించిన తీరు కోట్ల మంది కడుపు మండేలా చేస్తోంది. అనాగరిక రీతిలో ఒక యువతిపై అతడు చేసిన దాడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. అలాంటోడ్ని ఆషామాషీగా అస్సలు వదిలిపెట్టకూడదన్న మాట వినిపిస్తోంది.
ఏ తప్పు చేయని అమ్మాయిపై దారుణ రీతిలో దాడి చేయటమే కాదు.. ఆ ఆనాగరిక చర్యను స్నేహితుడి చేత వీడియో తీయించటం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియోను చూపించి మరో అమ్మాయిని బెదిరించిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఈ నెల 2న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఉదంతంలోకి వెళితే..
ఢిల్లీ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా వ్యవహరించే అశోక్‌కుమార్ తోమర్ కుమారుడు 21 ఏళ్ల రోహిత్ సింగ్ తోమర్. అతగాడు తన స్నేహితుడితో కలిసి ఒక ప్రైవేటు కంపెనీ ఆఫీసులో ఒక యువతిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు.
ఒక అమ్మాయి కిందకు పడేసి కొట్టటం.. తర్వాత అనాగరిక రీతిలో జుట్టు పట్టుకొని లేపి మరీ దాడి చేయటం.. డొక్కొల్లో తన్నటం.. నేల మీద పడేసి ఈడుస్తూ.. కాళ్లతో బలంగా తన్నటం లాంటి హింసకు పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీస్తున్న అతడి స్నేహితుడు సైతం రోహిత్.. ఆగు.. చాలు.. ఆగు అంటూ వారిస్తున్న స్వరం కూడా వీడియోలో వినిపించింది.
ఈ వీడియోను చూపించిన రోహిత్ సన్నిహితురాలైన మరో యువతిని బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోకుంటే.. ఆమెను సైతం అంతేలా హింసిస్తానని.. దాడి చేస్తానని బెదిరించటంతో బెదిరిపోయిన ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. తనకు చూపించి భయపెట్టిన వీడియో వివరాలు వెల్లడించిన ఆమె మాటలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. తనపై పైశాచికంగా దాడికి పాల్పడ్డాడంటూ రోహిత్ కారణంగా దెబ్బలు తిన్న మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోహిత్ తనను ఒక ఫ్రెండ్ కార్యాలయానికి పిలిపించి అక్కడ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆమె కంప్లైంట్ చేసింది. దీంతో.. రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు రోహిత్ ను అరెస్ట్ చేశారు. యువతిపై అనాగరికంగా దాడికి పాల్పడ్డ రోహిత్ వైరల్ వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వారు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సైతం సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
SOURCE:GULTE.COM