ఇల్లీ బేబీ షూటింగ్ నుంచి వెళ్లిపోయిందా
విభాగం: సినిమా వార్తలు
did-i-go-from-baby-shooting_g2d

ఇలియానా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. తొలి సినిమా ‘దేవదాసు’తోనే సూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకుని శరవేగంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏడెనిమిదేళ్ల పాటు టాలీవుడ్ లో హవా సాగించిన ఈ గోవా బ్యూటీ.. ఇక్కడ అవకాశాలు వస్తుండగానే బాలీవుడ్ వైపు చూసింది. అక్కడ మంచి పేరు రావడంతో మళ్లీ ఇటువైపు చూడలేదు. ఇక్కడి నుంచి ఛాన్సులొచ్చినా తిరస్కరించింది. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు తెలుగులో ఒక సినిమా అంగీకరించిందీ డస్కీ బ్యూటీ.

రవితేజ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో ఇల్లీ బేబీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నెలన్నరగా అమెరికాలో జరుగుతోంది. ఇలియానా నేరుగా అమెరికాకే వెళ్లి చిత్రీకరణలో పాల్గొంది. దాదాపు నెల రోజుల పాటు ఆమె షూటింగ్ కు హాజరైంది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తవడంతో ఇలియానా.. రవితేజ అండ్ టీంకు టాటా చెప్పేసి ముంబయి పయనమైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఆమెకు ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చాడు. ఇలియానాపై అతను ప్రశంసల జల్లు కురిపించాడు కూడా. ఐతే ఇంతటితో ఈ సినిమాలో ఇలియానా పనైపోలేదు. ఇంకో షెడ్యూల్ కు రావాల్సి ఉంది. అది కూడా అమెరికాలోనే అంటున్నారు

 

SOURCE:TUPAKI.COM

14 Jul, 2018 0 379
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved