విజేత చూసి చిరు ఏమన్నారో తెలుసా
విభాగం: సినిమా వార్తలు
did-you-know-what-the-winner-looked-like_g2d

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చాడు. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో తాజాగా విడుదలైన ‘విజేత’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. గురువారం నగరంలోని ప్రసాద్ ల్యాబ్ లో కల్యాణ్ దేవ్ తెరంగేట్రం చేసిన ‘విజేత’ మూవీని చిరంజీవి వీక్షించారు. మూవీ చాలా బాగా తీశారని దర్శకుడిని మెగా స్టార్ ప్రశంసించారని.. తొలి సినిమా అయినా కళ్యాణ్ దేవ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించారని చిరు మెచ్చుకున్నట్టు తెలిసింది. చిరంజీవితో పాటు కళ్యాణ్ దేవ్ - నిర్మాత అల్లు అరవింద్ - మురళీ శర్మ - మూవీ యూనిట్ సభ్యులు.. ‘విజేత’ స్పెషల్ షో చూశారు. యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ కెరీర్ సజావుగా సాగాలని వారు ఆకాంక్షించారు.

 హీరోగా రావడానికి ముందే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందానని.. ఆ శిక్షణ పూర్తయిన వారానికే విజేత మూవీ ఆఫర్ వచ్చిందని.. కథను మావయ్యకు చెప్పగానే చాలా బాగా నచ్చిందన్నారని కళ్యాణ్ దేవ్ చెప్పారు. ఈ మూవీలో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని మెగాస్టార్ చెప్పిన మాటలు నిజమయ్యాయని.. ఇప్పుడు అందరూ అదే ప్రశంసిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో మురళీ శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీలో కళ్యాణ్ దేవ్ కు జోడిగా మాళవిక నాయర్ నటించారు

 

SOURCE:TUPAKI.COM

13 Jul, 2018 0 382
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved