
2009 వ సంవత్సరంలో అవతార్ సినిమా విడుదలైంది ఈ సినిమా విడుదల అయి 11 సంవత్సరాలు అయింది కానీ ఆ పేరు ని ఎవరు మరిచిపోలేకపోతున్నారు దానికి కారణం అవతార్ లో ఉన్న భారీ విజువల్ ఎఫెక్ట్ అని సినిమా ప్రేక్షకుల అభిప్రాయం .
ఇది ఇలా ఉండగా అవతార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డులను సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే అందుకే దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 2 ను ప్రకటించారు. ఈమధ్యనే అవతార్ 2 చిత్రీకరణ న్యూజిలాండ్‌లోని లైవ్ యాక్షన్ ఫిల్మింగ్ లో వంద రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకొని గుమ్మడికాయ పగలగొట్టారు. వంద రోజుల చిత్రీకరణ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు .
అవతార్ 2 సినిమా ను 2021లో డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ Jon Landau తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రొడ్యూసర్ మరియు దర్శకుడు జేమ్స్ కామెరూన్ 2021లో డిసెంబర్లో అవతార్ 2 సినిమాను విడుదల చేయడంపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి . కరోనా గురించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ కి ముందే తెలుసా ఇటువంటి ఊహలో జేమ్స్ కామెరూన్ సినిమాలు నిర్మిస్తారా అనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సినిమా అభిమానులు .
ఏది ఏమైనప్పటికీ అవతార్ 2 అనుకున్న టైం కే వస్తుంది అని ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు