శునకాలు కరోనా రోగులను పసిగడతాయా
విభాగం: జనరల్
do-dogs-sniff-out-corona-patients_g2d

Covid 19 పరీక్షలకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలను ఉపయోగించవచ్చు అని ఈశాన్య ఫ్రాన్సు లోని ఒక పరిశోధనా సంస్థ తెలియజేసింది. 
కరోనా వైరస్ యొక్క ఉనికిని గుర్తించడానికి భవిష్యత్తులో రైల్వేస్టేషన్ ,విమానాశ్రయం ,బస్ స్టేషన్ మరియు రద్దీ గా ఉండే షాపింగ్ మాల్స్ లో కుక్కలను వాడ వచ్చు అని అది వాసన ఆధారంగా కరోనా వైరస్ వ్యక్తికి సోకిందా లేదా అన్నది గుర్తిస్తుంది అని అవి వాసన ఆధారంగా కొరోనా వైరస్ వ్యక్తి కి సోకిందా లేదా అన్నది గుర్తిస్తుంది అని అలా గుర్తించడంలో కుక్కలకు శిక్షణ ఇస్తున్నాము అని ఫ్రాన్సు లో ఒక సంస్థ తెలియజేసింది. 

కుక్కలు వాసన ద్వారా గుర్తుపట్టడం లో చాలా తెలివైనవి అని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గనులను గుర్తించడానికి కుక్కలను వాడారు అని గుర్తు చేస్తూ అలాగే నేరం చేసిన వారిని దొంగ కరెన్సీని చాటుగా నడిపేవారిని , పేలుడు పదార్థాలను మరియు ఆయుధాలను బయటకు తీయడానికి శిథిలాల కింద చిక్కుకున్న భూకంప బాధితులను తెలుసుకోవడానికి వాడుతారు అని కుక్కల ముక్కులో 200 మిలియన్ల ఘ్రాణ గ్రాహక కణాలతో ఉండడం వలన ఈ గుర్తించే శక్తి వాటికి వచ్చింది అని రష్యన్ సంస్థ తెలిపింది . 

అలాగే ఇంతకు ముందు కుక్కలు మలేరియాను గుర్తించగలవని అధ్యయనాలు వివరిస్తున్నాయి అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను కూడా కుక్కలు గుర్తు పడతాయి అలాగే covid 19 పై ప్రభావవంతంగా కుక్కలు పనిచేస్తాయి అని మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తామని ఫ్రాన్సు లోని పరిశోధనా సంస్థ తెలియజేసింది

23 Jul, 2020 0 1650
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved