వినోదం కావాలి అంటే Amazon Prime, Netflix సర్వీసులు ఉండాలా...?
విభాగం: జనరల్
do-we-need-amazon-prime-and-netflix-services-for-entertainment_g2d

వినోదం ఈ పధం ప్రతీ ఒక్కరి జీవితాలలో ఏదో ఒక క్షణాన రుచి చూడవలసిన ఒక విందు. ప్రజలును అలరించడం లో వినోదరంగానికి ఏ ప్రభుత్వం అయినా పెద్ద పీఠ వేస్తుంది. ఒకప్పుడు వినోదం కావాలి అంటే జనాలు నాటకాలు చూసేవారు తరువాత తోలుబొమ్మలాటలు వచ్చాయి. ఈ తోలుబోమ్మలాటలను తెరమీద వేసి ప్రజలను ఆనందపరిచేవారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మొదట తెరబొమ్మగా వినోదాన్ని పంచె బొమ్మలుగా తోలుబోమ్మలును వర్ణిస్తారు. తోలుబొమ్మలు తరువాత రీల్ నడుపుతూ తెరమీద చూపించేవారు, ఆ తరువాత రీల్ సైజు పెరిగి ఒక పెద్ద సినిమాగా మారింది ఆ సినిమాను చూడాలి అంటే థియేటర్ కు వెళ్ళాలి కానీ కరోనా సమయంలో థియేటర్స్ ఓపెన్ చేయడం అనేది మరో ఆరునెలల వరకు జరగక పోవచ్చు. ఇలా అయితే వినోదం పొందడం ఎలా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తుకొచ్చేవి Amazon Prime, Netflix.

      గత కొన్ని సంవత్సరాలు నుండి Amazon Prime, Netflix వంటి OTT సర్వీసులుకు విపరీతమైన ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే  2018తో పోల్చుకుంటే OTT రంగం మరింత కొత్త టెక్నాలజితో ముందుకు దూసుకుపోతూ ఇప్పటికి మరిన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అటువంటి వాటిలో “Aha” ఒకటి.

      2018 లో 500కోట్లు ఉన్న ఈ వ్యాపార రంగం ఇప్పటికి అమాంతంగా పెరిగి 10,000కోట్లకు చేరుకుందని ఒక అంచనా. ఈ నేపథ్యo లో ఇప్పటికే ఉన్న అనేక OTT సర్వీసులతో పాటు మరికొన్ని OTT సర్వీసులు కొత్తగా చేరాయి.

      వినియోగదారులను ఆకర్షించేవిధంగా వివిధ టెలికాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వినియోగదారులకు మొదటినెల ఉచిత 
సబ్ స్కృప్సన్ అందించడం వంటి చర్యలకు OTT లు ఒక శ్రీకారం చుడుతున్నాయి. దీనివల్ల తక్కువ సమయంలో కోట్లాది మంది వినియోగదారులును తమ సర్వీసులోకి తీసుకు రావచ్చు అని భావిస్తున్నాయి.

      అలాగే చిన్న సినిమాలు OTT వంటి ఫ్లాట్ ఫామ్ లు చక్కగా వినియోగించుకుంటున్నాయి. వినియోగదారులకు ఎటువంటి సినిమాలు కావాలి అని తెలుసుకొని వారికి తగ్గ సినిమాలను ఇవ్వడంలో Amazon Prime, Netflix సర్వీసులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి.

22 Jul, 2020 0 1262
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved