డిజాస్టర్ డైరెక్టర్ తో ఈషా రెబ్బ లేడీ ఓరియెంటెడ్ మూవీ
విభాగం: సినిమా వార్తలు
eesha-rebba-lady-oreiented-film-with-a-disaster-director_g2d

నివాసరెడ్డి అనే దర్శకుడు తన రేంజిలో ఏవో కామెడీ సినిమాలు చేసుకుంటూ బాగానే ఉండేవాడు. 'అదిరిందయ్యా చంద్రం'.. 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' లాంటి కామెడీ సినిమాలు బాగానే ఆడాయి. అతడికి మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చాయి. 

ఐతే మీడియం రేంజి హీరోలు సైతం శ్రీనివాసరెడ్డితో పని చేయని సమయంలో అక్కినేని నాగార్జున లాంటి పెద్ద స్టార్ అతడికి ఛాన్సిచ్చి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. కానీ ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాగ్‌తో అతను తీసిన 'ఢమరుకం' పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో అతను ఎటూ కాకుండా పోయాడు. ముందులా చిన్న సినిమాలు చేయలేకపోయాడు. అలాగని పెద్ద సినిమాల్లోనూ ఛాన్సులు రాలేదు. కెరీర్‌కు అనూహ్యంగా బ్రేక్ పడిపోయింది.

కొంచెం గ్యాప్ తీసుకుని మంచు మోహన్ బాబు-అల్లరి నరేష్ కాంబినేషన్లో 'మామ మంచు అల్లుడు కంచు' అనే చిత్రం తీస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. దెబ్బకు మళ్లీ కోలుకోలేకపోయాడు శ్రీనివాసరెడ్డి. మూడేళ్లకు పైగా అతను అడ్రస్ లేడు. ఇక శ్రీనివాసరెడ్డి కెరీర్ ముగిసిందనే అంతా అనుకుంటుండగా.. ఇప్పుడు మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అతను థ్రిల్లర్ మూవీ చేస్తుండటం విశేషం. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం గమనార్హం. తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 'ఢమరుకం'లో విలన్ పాత్ర చేసిన గణేష్ వెంకట్రామన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడట శ్రీనివాసరెడ్డి. కొత్త రచయితలు ఈ చిత్రానికి స్క్రిప్టు సమకూర్చారట. మరి తనకు టచ్ లేని థ్రిల్లర్ జానర్లో శ్రీనివాసరెడ్డి ఏమాత్రం మెప్పిస్తాడో చూడాలి.

 

SOURCE : GULTE

03 Apr, 2019 0 372
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved