ప్రతి ఒక్కడి కీ కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్ బీర్ లా ఉండడు
విభాగం: సినిమా వార్తలు
every-one-needs-kathirina-kaif-..-but-nobody-has-ranabir_g2d

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు స్టార్ల స్టేటస్ మారిపోతోంది. నిన్నటివరకూ రకుల్ ముచ్చట మీడియాలోనూ.. సోషల్ మీడియాలో కనిపించింది లేదు. కానీ.. ఈ రోజు ఆమె హాట్ టాపిక్. ఢిల్లీలో మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై ఎంత హాట్ చర్చ జరుగుతుందో.. తాజాగా రకుల్ పెట్టిన పోస్టు మీదా అంతే హాట్ డిస్కక్షన్ జరుగుతోందిసోషల్ మీడియాలో తాజా సంచలనంగా మారిన రకుల్ మాట.. ఇప్పుడు అమ్మాయిలకు ఒక ఆయుధంగా మారుతుందనటంలో సందేహం లేదు. ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్ బీర్ లా ఉండడంటూ రకుల్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఉన్నట్లుండి కత్రినా ప్రస్తావన రకుల్ ఎందుకు తెచ్చినట్లు? అన్న డౌట్ వచ్చిందా?  అక్కడికే వస్తున్నాం.

ఎవరైనా రకుల్ ను హర్ట్ చేస్తే.. ఆమె ఇలా మాట్లాడిందా? అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అయినా.. రకుల్ ను ఎవరు మాత్రం హర్ట్ చేయగలరు చెప్పండి. అమ్మడి వాలు చూపు తగిలితే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇంతకీ రకుల్ నోటి నుంచి కత్రినా ముచ్చట ఎందుకంటే.. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న "చి ల సౌ" మూవీ ప్రమోషన్ లో భాగంగా రకుల్ చేత ఒక డైలాగ్ డబ్ స్మాష్ చేశారు. దీన్ని ఇన్ స్టోగ్రామ్లో పెట్టటంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుశాంత్ లీడ్ రోల్ ప్లే చేస్తూ.. అతడికి జోడీగా రుహాని శర్మ నటిస్తున్న ఈ మూవీతో రాహుల్ రవీంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలవుతున్న ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమాను రిలీజ్ కు ముందే.. సినీ ప్రముఖులు.. చిత్ర బృందంతో చూడాలనుకునే వారికి బంఫర్ ఆఫర్ ఇస్తున్నారు.రకుల్ డబ్ స్మాష్ ను ఎవరికి వారు FunWithChiLaSow హ్యాష్ ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే.. ఎవరిదైతే ఆకట్టుకునేలా ఉంటుందో అలాంటి వారిని ఎంపిక చేసి.. ఈ మూవీని విడుదలకు ముందే చూపించేస్తారట. మరిక ఆలస్యం ఎందుకు..ఒక డబ్ స్మాష్ చేసేస్తే పోలా

 

SOURCE:TUPAKI.COM

20 Jul, 2018 0 336
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved