ఇంద్రగంటి మల్టీస్టారర్ లో హీరోలు ఫిక్స్
విభాగం: సినిమా వార్తలు
fix-heroes-in-indraganti-multistar_g2d

సమ్మోహనంతో సక్సెస్ అందుకున్న ఇంద్రగంటి, తన నెక్ట్స్ ప్రాజెక్టుగా ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోలు ఫిక్స్ అయ్యారు. కాకపోతే అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదంతే. 

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమాలో నాని, శర్వానంద్ హీరోలుగా నటించబోతున్నారు. వీళ్లిద్దరి కాల్షీట్లు దిల్ రాజు వద్ద ఉన్నాయనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దర్నే హీరోలుగా పెట్టి, ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. 

ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సాగబోతోంది. సినిమాలో హీరో ఎవరనే విషయం ఫస్టాఫ్ వరకు తెలియదట. ఒకదశలో నాని, మరోదశలో శర్వానంద్ విలన్లుగా కనిపిస్తారట. హీరో ఎవరనే విషయం సెకండాఫ్ లో రివీల్ అవుతుందట. అలా ఊహించని ట్విస్టులతో సాగిపోతుందట ఈ మల్టీస్టారర్. 

ప్రస్తుతానికైతే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ ఇదే. సాంకేతికంగా ఈ సినిమాలో పెద్దగా మార్పుచేర్పులు ఉండవని తెలుస్తోంది. రెగ్యులర్ గా ఇంద్రగంటి సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్లే దీనికి కూడా వర్క్ చేస్తారు

 

SOURCE:GREATANDHRA.COM

15 Jul, 2018 0 362
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved