నాలుగు సినిమాలు.. దేనికీ బజ్ లేదు
విభాగం: సినిమా వార్తలు
four-films-..-no-baz_g2d

వేసవి సినిమాల సందడి ముగిశాక టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఊపే లేదు. జూన్ నెల నుంచి బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘ఆర్ఎక్స్ 100’ మినహాయిస్తే మరే సినిమా కూడా జనాల్ని పెద్దగా థియేటర్లు రప్పించలేకపోయింది. చాలా వరకు థియేటర్లు వెలవెలబోయాయి. చాలా సినిమాలు వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో ఇటు స్టూడెంట్స్, అటు పేరెంట్స్ ఆ హడావుడిలో పడిపోయి థియేటర్లకు రావడం తగ్గిపోయింది. దీంతో కొత్త సినిమాలకు ఆశించిన బజ్ కనిపించడం లేదు. పెద్ద సినిమాలైతే ఏ టైంలో అయినా జనాలు థియేటర్లకు వస్తారు కానీ.. చిన్న సినిమాలకు మాత్రం ఇబ్బందులు తప్పవు. రాబోయే వీకెండ్లో మూణ్నాలుగు సినిమాలు వస్తున్నాయి కానీ వేటికీ బజ్ కనిపించడం లేదు. ఆ సినిమాల నేపథ్యం కూడా అందుకు కారణం.

ఈ వీకెండ్లో రాబోయే సినిమాల్లో ముందు చెప్పుకోవాల్సింది ‘లవర్’ గురించి. వరుసగా అరడజను దాకా ఫ్లాపులు తిన్న రాజ్ తరుణ్ నటించిన చిత్రమిది. మూడేళ్ల ముందు అతడికి మంచి మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా దెబ్బ తినేసింది. ఈ ఏడాది ఆల్రెడీ రెండు డిజాస్టర్లు తిన్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడం.. ‘అలా ఎలా’తో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించడం ప్లస్సే కానీ.. రాజ్ తరుణ్ ట్రాక్ రికార్డు కారణంగా ఈ చిత్రానికి ఆశించిన బజ్ కనిపించడం లేదు. ఇక మంచు లక్ష్మి నటించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా ఈ శుక్రవారమే విడుదలవుతుంది. లక్ష్మి కెరీర్లో ఇప్పటిదాకా హిట్ అన్నదే లేదు. ఆమె కథానాయికగా నటించిన సినిమాలేవీ ఆడలేదు. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్ బాగున్నప్పటికీ.. ప్రేక్షకుల్ని ఇది ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందన్నది సందేహమే. ఇక ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన చంద్రసిద్దార్థ ‘ఆటగదరా శివా’ అంటూ వస్తున్నాడు. ఇందులో నటించిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ఏ ఆకర్షణా కనిపించడం లేదు. కానీ దీని ట్రైలర్ కూడా బాగానే అనిపించింది. అయినా ఇది ఏమాత్రం జనాల్ని ఆకర్షిస్తుందో చూడాలి. వీటితో పాటుగా ‘పరిచయం’ అనే సినిమా కూడా రాబోతోంది కానీ.. దాని గురించి అసలే డిస్కషన్ లేదు

 

SOURCE:GULTE.COM

17 Jul, 2018 0 321
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved