
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ‘జనసేన పోరాట యాత్ర’లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భీమవరంలో బహిరంగ సభ ఉంటుంది.
వన్ టౌన్, పి.పి.రోడ్ లో ఉన్న పోలీస్ బొమ్మ దగ్గర ఈ సభను ఏర్పాటు చేశాం. భీమవరం, ఉండి నియోజకవర్గాల జన సైనికుల కోరిక మేరకు... రెండు నియోజవర్గాల పోరాట యాత్రకు భీమవరం పట్టణాన్నే కేంద్రంగా చేశాం. రెండు నియోజక వర్గాల నుంచి భారీ సంఖ్యలో ఈ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాల జన సైనికులతో సమావేశం నిర్వహించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో దిగ్విజయంగా పోరాట యాత్ర పూర్తయింది. అక్కడ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పోరాట యాత్ర సభను నిర్వహించాం. ఉభయ గోదావరి జిల్లాల్లో పోరాట యాత్రకి పశ్చిమ గోదావరిలో భీమవరం పట్టణం నుంచి మొదలుపెట్టారు. గత మూడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వారు పలు సమస్యల్నీ, స్థానిక పరిస్థితుల్నీ వివరించారు.
SOURCE:JANASENAPARTY.ORG