గద్దర్ సతీమణి రాజకీయాలలోకి వస్తున్నారా...
విభాగం: రాజకీయ వార్తలు
gaddar-wife-in-to-politics_g2d

ప్రజాయుద్ద నౌక గద్దర్ సతీమణి ప్రజాస్వామ్య రాజకీయాలలోకి వస్తున్నారా...గడచిన నాలుగు దశాబ్దాలుగా బ్యాలట్ రాజకీయాలను విశ్వసించని గద్దర్ బుల్లేట్ రాజకీయాలే దేశాన్ని మారుస్తాయని విశ్వసించారు. అందుకోసం కాలికి గజ్జ , బుజాన గొంగళి వేసుకుని ఆనాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్ట్ పార్టీకి సానుభూతి పరుడిగా వ్యవహరించారు. 

జననాట్యమండలి పేరతో నక్సలైట్ల సిద్దాంతాలను దేశవ్యాప్తందా ప్రచారం చేసారు. కొన్నాళ్ల పాటు రహస్య జీవితం గడిపిన గద్దర్ పై కాల్పులు కూడా జరిగాయి. ఆయన శరీరంలో ఇప్పటికి ఆ బుల్లేట్లు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున చురుకుగా పాల్గున్న గద్దర్ తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని హోరెత్తించారు. ఇదంతా నడుస్తున్న చరిత్ర. తాజాగా గద్దర్ తన రూటు మార్చారు. ఆయన పార్టీ పెడతారని, ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారని, ప్రచారమూ జరిగింది. అయితే ఈ వార్తలను, ప్రచారాన్ని గద్దర్ తిప్పి కొట్టేరు. 

రెండు రోజుల క్రితం గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి, ఆ వార్తలను ఆయన ఖండించారు. అయితే తాజాగా గద్దర్ తన సతీమణి విమలతో కలసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనీయ గాంథీని కలిసారు. తెలంగాణ ఇచ్చింది సోనీయనే అంటూ ప్రసంసించారు. ఈ పరిణామం కాంగ్రెస్ తో పాటు తెలంగాణలోని రాజకీయ  పక్షాలనింటిని ఆశ్చర్యపరిచింది.

గద్దర్ కాంగ్రెస్‌లో చేరకపోయిన ఆయన సతీమణి విమలను కాంగ్రెస్‌లో చేర్పిస్తారని,  అందుకు నిదర్శనంగా సోనీయ గాంథీని కలిసారని అంటున్నారు. విమల సికిందరాబాద్‌లోని అల్వాల్‌లో బోధి మహావిద్యాలయం పేరిట ఓ స్కూలును నడుపుతున్నారు. అల్వాల్ చుట్టుపక్కల విమలకు మంచి గుర్తింపు వుంది. దీంతో గద్దర్ సతీమణి విమల తెలంగాణలో జరుగుతున్న  ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటి చేసే అవకాశం ఉంది. అల కాకపోయిన గద్దర్ సొంత జిల్ల కరీంనగర్ లోక్‌సభ స్దానం నుంచి పార్లమేంటుకు పోటి చేసే అవకాశం ఉంది. 

ఇంతకు ముందు ఈ లోక్‌సభ స్దానం నుంచి పొన్నం ప్రభాకర్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికలలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో పొన్నం ప్రభాకర్ శాసనసభకు పోటి చేసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా పొన్నం ప్రభాకర్‌ను శాసన సభకు పంపాలని భావిస్తోంది.  ఈ నేపథ్యంలో గద్దర్ సతీమణి విమల కాంగ్రెస్ నుంచి శాసనసభకు కాని, లోక్‌సభకు కాని కాంగ్రెస్ తరఫున పోటి చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రజాయుద్ద నౌక కాంగ్రెస్ యుద్ద నౌకగా మారుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

 

 

 

SOURCE:GULTE.COM

14 Oct, 2018 0 362
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved