తెలంగాణ ఎన్నికలకు సిద్ధంకండి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం: రాజకీయ వార్తలు
get-ready-for-telangana-elections-says-pawan-kalyan_g2d

తెలంగాణ శాసనసభ ఎన్నికలపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన జనసేన తెలంగాణ శాఖ ముఖ్యనేతలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వ్యూహాత్మక చర్చలు జరిపారు.

తెలంగాణకు ఏ క్షణాన ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి వీలుగా పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయాలని ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేసారు. తెలంగాణకు పార్టీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను కొద్దీ రోజులలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. కోఆర్డినేషన్ కమిటీ, జిల్లా కమిటీల  నియామకాన్ని  వెనువెంటనే ప్రారంభిస్తుందని, ఈ మొత్తం ప్రక్రియ రెండు మూడు వారాల్లో పూర్తి చేస్తుందని   తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణాలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చేసిన ప్రకటనలు ఈ సమావేశం దృష్టికి వచ్చాయి. ముందు పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో నిమగ్నం అవుదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని రాబోయే సమావేశాల్లో చర్చిద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పార్టీ తెలంగాణ ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బి. మహేందర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పదిహేను లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలని వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో జనసేన పార్టీ కార్యకర్తలతో భారీ సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరగనున్న ఈ సభకు సన్నాహాలు చేయవలసిందిగా తెలంగాణ నేతలకు సూచించారు. 

రాజకీయ వ్యవహారాల కమిటీలో శ్రీ ముత్తా గోపాల కృష్ణ :

ఈ రోజు జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయవేత్త, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో  నాలుగుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన శ్రీ ముత్తా గోపాల కృష్ణ గారిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ( ప్యాక్) లో సభ్యునిగా శ్రీ పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ రోజు జరిగిన ప్యాక్ సమావేశంలో శ్రీ ముత్తా కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కమిటీల నియామకానికి జరుగుతున్న తీరు తెన్నులపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చేనెలలో హైదరాబాద్ లో పార్టీ కి చెందిన ఐ.టి.నిపుణుల సమావేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా వున్న జనసేన ఐ.టి.నిపుణులే కాకుండా ఎన్.ఆర్.ఐ.లు కుడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వేలాదిమంది ఈ సమావేశంలో పాల్గొనడానికి తమ సంసిద్ధత్థను తెలుపుతూ పార్టీ పరిపాలన కార్యాలయానికి వర్తమానం పంపుతున్నారు. ఈ సమావేశంలో ప్యాక్ సభ్యులందరూ పాల్గొన్నారు.

 

 

SOURCE:JANASENA.ORG

18 Aug, 2018 0 352
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved