ఇక్కడ ఫ్లాప్.. అక్కడ హిట్
విభాగం: సినిమా వార్తలు
here's-the-flap-..-hit-there_g2d

ఒక భాషలో ఫ్లాప్ అయిన సినిమాలు ఇంకో భాషలో బాగా ఆడటం చాలా సార్లు చూశాం. తమిళ డబ్బింగ్ సినిమాల విషయంలో చాలాసార్లు ఇలా జరుగుతుంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు తమిళంలో ఆడినట్లు ఇక్కడ ఆడవు. ఆయన చివరి రెండు సినిమాలు ‘కబాలి’.. ‘కాలా’ల విషయంలో ఇదే జరిగింది. అవి రెండూ ఇక్కడ డిజాస్టర్లయితే.. తమిళంలో మాత్రం అవి బాగానే ఆడాయి. ఈ కోవలోనే కార్తి కొత్త సినిమా ‘కడై కుట్టి సింగం’ తమిళంలో భలేగా ఆడేస్తుంటే.. దీని తెలుగు వెర్షన్ ‘చినబాబు’ మాత్రం ఇక్కడ తుస్సుమనిపించింది.

గత వారం విడుదలైన ‘చినబాబు’కు తెలుగు రాష్ట్రాల్లో పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా తీసిపడేయదగ్గదేమీ కాకపోయినా.. మరీ తమిళ వాసనలు ఎక్కువగా ఉండటం.. సెంటిమెంట్ ఓవర్ డోస్ అయిపోవడంతో మన ప్రేక్షకులకు రుచించలేదు. కార్తి దీనికి ముందు చేసిన ‘ఖాకి’ హిట్టయినప్పటికీ దీనికి అదేమంత కలిసి రాలేదు. వీకెండ్లో ఓపెనింగ్సే అంతంతమాత్రంగా ఉండగా.. ఆ తర్వాత సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

ఐతే తమిళంలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతోంది. వారం రోజుల్లో రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందీ చిత్రం. కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ‘కబాలి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కడై కుట్టి సింగం’ నిలవడం విశేషం. రెండో వారంలో కూడా ఆ చిత్రం మంచి వసూళ్లతో సాగుతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో బి-సి సెంటర్లలో ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కుతో్ంది. కార్తి కెరీర్లోనే ఇది అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు

 

SOURCE:GULTE.COM

21 Jul, 2018 0 278
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved