హీరోను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అన్న హీరొయిన్
విభాగం: సినిమా వార్తలు
heroine-says-she-will-marry-only-a-hero_g2d

సినిమా ఇండస్ట్రీ లో అతి తక్కువగా వినిపిస్తున్న మాటలు “హీరోను మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను” ఇటువంటి మాటలే ఇప్పుడు హీరొయిన్ త్రిష నోటి వెంట వస్తున్నాయి అని ఇండస్ట్రీ లో గుసగుస లు మొదలైనాయి.
ప్రియదర్శిని దర్శకత్వంలో 1999 లో Leson Leson సినిమా లో బ్లింక్ అండ్ మిస్ పాత్రలో త్రిష తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో తన జీవితాన్ని మొదలు పెట్టిన త్రిష ఎన్నో సినిమాలు చేస్తూ మెట్టుకు మెట్టు పైకి ఎదుగుతున్న క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రెండు దశాబ్ధాలకు పైగా ప్రేక్షకులను మెప్పిస్తుంది.హీరొయిన్లు కొన్ని సంవత్సరాలు కన్నా ఎక్కువకాలం వాళ్ళ జీవితాన్ని సినిమాలలో నడిపించలేరు.కనీ త్రిష కృష్ణన్ మాత్రం సుమారు రెండు దశాబ్ధాలుగా  సినిమాలలో రాణించడం చెప్పుకో దగ్గ విషయం.
చాలామంది హీరొయిన్లు వాళ్ళ పెళ్లిని హీరోతో కాని ఒక మంచి డైరెక్టర్ తో గాని నిశ్చయించుకుంటారు. అలాగే త్రిష కూడా హీరో దగ్గుబాటిరాణా తో తన ప్రేమను కొనసాగించింది.కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్ళ మధ్య ప్రేమబంధం తెగిపోయింది.తరువాత 2015 లో త్రిష కృష్ణన్ తన మరో ప్రియుడు వరుణ్ మానియన్ తో నిచ్చితార్ధం చేసుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఈ వివాహం నిలిపివేయబడింది.
తరువాత తన పాత ప్రేమికుడు శింబును లాక్ డౌన్ తరువాత పెళ్లి చేసుకోబోతుంది అని సినిమా వర్గాలలో ప్రచారం జరుగుతుంది.ఇంతకు ముందు హీరో శింబు మరియు “ఏ మాయ చేసావే” తమిళ వెర్సన్ లో నటించారు.ఇప్పుడు గౌతమ్ మీనన్ చిత్రానికి సీక్వెల్ కోసం వీరు కలిసి పనిచేయడం మన అందరికీ తెలిసిందే.

21 Jul, 2020 0 210
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved