
మహిళల విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా న్యాయస్థానాలు మహిళలకోసం క్షణక్షణం న్యాయపోరాటం చేస్తున్నా సమాజంలో మహిళకు రక్షణ లేకుండా పోతుంది. ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా మహిళలకు రక్షణ కరువైంది .చిన్న పెద్ద తేడా లేకుండా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో స్త్రీలపై మృగాలు విరుచుకు పడుతూనే వున్నాయి . మహిళలు కూడా మనుషులే అన్న విషయాన్ని కూడా మరిచిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని బాలికల పైనా తమ ప్రతాపాన్ని చూపుతున్నారు ఇటువంటి దారుణమైన సంఘటనే హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో జరిగింది .
35 సంవత్సరాలు ఉన్న మహిళ ఒక కూతురు , కొడుకు తో కలిసి ఒక ఇంటిలో అద్దెకు ఉంటుంది. తరచూ ఇంటికి వస్తున్న ఇంటి యజమాని ఆ మహిళ పై కన్నేశాడు ఏదో విధంగా ఆ మహిళను లోబరుచుకోవాలని అనుకొన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఒక రోజు మహిళ తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు . మత్తుమందు కలిసింది అని తెలియని ఆ మహిళ ఆ ఆహారాన్ని తినడంతో స్పృహ కోల్పోయింది . అది గమనించిన ఇంటి యజమాని తన స్నేహితులతో మద్యం సేవించి తల్లి కూతుళ్ల పై లైంగిక దాడి చేశాడు. గమనించిన చుట్టుపక్కల వ్యక్తులు పోలీసులకు తెలియజేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను , ఆమె కూతుర్ని కొడుకును హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని అని తెలియజేశారు