ప‌వ‌న్ కు క‌వాతుకు డ‌బ్బులు ఎక్క‌డివి?
విభాగం: రాజకీయ వార్తలు
how-did-pawan-get-money-for-kavathu_g2d

నా నోట్లో నుంచి ఒక్క మాట బ‌య‌ట‌కు రావాలంటే ఎంతో వేద‌న గుండెల్లో జ‌రుగుతుంది. అప్పుడు మాత్ర‌మే నేను మాట్లాడ‌తానంటూ ప‌వ‌న్ చెప్పిన మాట‌లు విన్న‌ప్పుడు.. వామ్మో.. ఎంత ఆలోచ‌నాప‌రుడు ఇన్నాళ్ల‌కు ఆంధ్రాలో రాజ‌కీయం చేయ‌టానికి వ‌చ్చాడండి అంటూ బుగ్గ‌లు నొక్కున్నోళ్లు ఉన్నారు. తాను బాధ్య‌త ఉన్న వాడిన‌ని.. త‌న‌కు ప‌ద‌వి మీద కాంక్ష అస్స‌లు లేద‌ని.. చెప్పిన‌ప్పుడు కాసింత అనుమానంగా చూసినా.. మ‌న ప‌వ‌నే క‌దా న‌మ్మొచ్చ‌ని ఫీలైనోళ్లు ఉన్నారు.

రాజ‌ధాని భూముల మీద అన‌వ‌స‌ర‌మైన ర‌చ్చ జ‌రుగుతున్న‌ప్పుడు రంకెలేసేందుకు వ‌చ్చి.. అక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధిని క‌ళ్లారా చూడ‌ట‌మే కాదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడిన‌ప్పుడు రాజ‌ధాని భూసేక‌ర‌ణ విష‌యంలో ఏపీ స‌ర్కారు ఎంత దూర‌దృష్టితో ఉంద‌న్న విష‌యం అర్థ‌మై నెమ్మ‌దిగా స‌ర్దుకొని ప‌రువు ద‌క్కించుకున్నారు.
ఇలా.. ఏదో చేద్దామ‌ని రావ‌టం.. చేసేందుకు ఏమీ లేద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యాక మౌనంగా ఉండ‌టం ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ చేసింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర్లోకి వ‌చ్చేసిన వేళ‌.. ఏదోర‌కంగా మైలేజీని సొంతం చేసుకోవ‌ట‌మే ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు మారింది. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న స్వ‌రంలోనూ తేడా వ‌చ్చింది.

ఒక‌ప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వా? అన్న వ్య‌క్తి కాస్తా.. ఇప్పుడు కానిస్టేబుల్ కొడుకు సీఎం కావొద్దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయినా.. కానిస్టేబుల్ కొడుకు సీఎం కావొద్ద‌ని ఎవ‌ర‌న్నారు?  టీ అమ్మిన వ్య‌క్తిని నెత్తిన ఎక్కించుకొని ప్ర‌ధాని కుర్చీలో కూర్చోబెట్టినందుకు నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ.. పెట్రో బాదుడుతో ఎంత‌గా చుక్క‌లు చూపించాలో అంత చూపిస్తున్నాడు. అంతేనా.. తిరుపతి వెంక‌న్న‌ సాక్షిగా ప్ర‌త్యేక హోదా అమ‌లు ప‌క్కా అన‌ట‌మే కాదు..  ఢిల్లీని త‌ల‌పించేలా అమ‌రావ‌తిని క‌ట్టి చూపిస్తామ‌న్న మాట‌ను తూచ్ అని వెన‌క్కి తీసుకోవ‌టం మోడీ దొర‌వారికే ద‌క్కింది.

ఇప్పుడేమో పోలీస్ కానిస్టేబుల్ కొడుకు సీఎం కావొద్దంటారా? అన్న ప్ర‌శ్న‌ను సంధించ‌టం ద్వారా సెంటిమెంట్‌ను రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప‌వ‌న్‌. కొన్నేళ్ల క్రితం ఇదే రీతిలో ఆయ‌న సోద‌రుడు చిరంజీవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. పార్టీ పెట్టి మ‌రీ మొత్తంగా మార్చేస్తాన‌ని చెప్పి.. చివ‌ర‌కు ఆయ‌నే మారిపోయిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
ఎక్క‌డికి వెళితే అక్క‌డ  త‌న‌దైన మాట‌లు చెప్పే ప‌వ‌న్‌.. అంత‌కు ముందు తాను ప‌ర్య‌టించిన ఉద్దానంతో స‌హా.. సిక్కోలు మొత్తం తిత‌లీ బారిన ప‌డి దారుణ అవ‌స్థ‌ల‌కు గురైన వేళ‌.. సాయం చేయాల‌ని త‌న జ‌న‌సైనికుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేసి.. త‌న‌వంతు సాయంగా ఏదైనా చేయాల్సింది పోయి.. గోదావ‌రి జిల్లాలో క‌వాతును నిర్వ‌హించ‌టం ఏమిటి?  కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు చేయ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

ఆ మ‌ధ్య‌న తుఫానుతో దారుణంగా దెబ్బ తిన్న కేర‌ళ‌ను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది త‌మ ఖ‌ర్చుల‌కు కోత పెట్టుకొని.. వ‌ర‌ద బాధితుల‌కు త‌మ‌కు తోచిన సాయం పంపే ప్ర‌య‌త్నం చేశారు. అంతేనా.. మ‌న పొరుగున ఉన్న కేర‌ళ కోసం ఎంతోకొంత చేద్దామ‌ని భావించినోళ్లు కోట్లాది మంది ఉన్నారు. మ‌రి.. అలాంటిది ఏపీలోని వెనుక‌బ‌డి.. పాల‌కుల నిరాద‌ర‌ణ‌కు గురైన సిక్కోలుకు పెద్ద క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు.. ఆదుకోవాల్సింది పోయి.. క‌వాతుల పేరుతో గావుకేక‌లు వేయ‌టం.. అర్థం లేని ఉప‌న్యాసాలు దంచ‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. రాజ‌కీయాలు ఎప్పుడైనా చేసుకోవ‌చ్చు ప‌వ‌న్‌. కానీ..సాయం చేయాల్సింది మాత్రం ప్ర‌జ‌లు క‌ష్టంలో ఉన్న‌ప్పుడేన‌న్న చిన్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది. ఇవ‌న్నీ స‌రే కానీ.. అంత భారీ క‌వాతుకు అయిన ఖ‌ర్చును సిక్కోలుకు ఇస్తే.. వారెంతో సంతోషించే వారు క‌దా ప‌వ‌న్‌?

 

 

 

 

SOURCE:GULTE.COM

17 Oct, 2018 0 358
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved