
చిన్నపిల్లాడు అమాయకంగా ముఖం పెట్టి.. నాదేం తప్పు లేకున్నా పనిష్మెంట్ ఇచ్చారు మిస్ అన్నట్లుగా.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణిపై వచ్చిన వార్తల నేపథ్యంలో కంపెనీలతో భారతికి ఏం సంబంధం? అంటూ విసిరిన ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయే సమాధానం బయటకు వచ్చింది.
తన రెండు పేజీల బహిరంగ లేఖలో జగన్ ప్రస్తావించిన అంశాలకు మించిన వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కంపెనీలతో తన సతీమణికి ఏం సంబంధం లేదన్నట్లుగా బహిరంగ లేఖలో చెప్పుకున్న జగన్ వాదనకు భిన్నమైన వాస్తవాలు బయటకు వచ్చాయి.
జగన్ తన గ్రూపు కంపెనీల నుంచి డైరెక్టర్ గా బయటకు వచ్చేసిన తర్వాత ఆయన స్థానాన్నిజగన్ సతీమణి భారతి పోషిస్తున్న వైనాన్ని ఈడీ తన చార్జిషీట్లో వెల్లడించింది. అంతేకాదు.. ఆయా కంపెనీల విధానపరమైన నిర్ణయాల్లోనూ.. నిధుల బదిలీకి సంబంధించిన చెక్కులపైనా.. ఆడిట్ బ్యాలెన్స్ షీట్ల మీదా భారతి సంతకం ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని చేస్తూ.. కంపెనీలతో భారతికి ఏం సంబంధం ? అంటూ జగన్ క్వశ్చన్ వేస్తున్న ప్రశ్నలకు ఆయన నోటి నుంచి మళ్లీ మాట రాని రీతిలో సమాధానాలు వస్తున్నాయి.
భారతి సిమెంట్స్ కు సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదులో 19 మంది నిందితులు ఉండగా.. వారిలో భారతిని ఐదో నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జిసీట్ దాఖలు చేశారు. ఎందుకిలా ఉంటే.. భారతి సిమెంట్ తో పాటు జగన్ కంపెనీల్లో డైరెక్టర్ గా.. ప్రధాన వాటాదారుగా ఆమె కీలకపాత్ర పోషించిన వైనాన్ని ఈడీ తన ఛార్జిషీట్లో వెల్లడించింది.
అంతేనా.. ఆర్థిక ఫలాల్ని ఆమె అనుభవిస్తున్నట్లుగా వ్యాఖ్యానించింది కూడా. విచారణలో భాగంగా తమ ముందుకు భారతిని హాజరు కావాలని మూడుసార్లు అడిగితే.. ఒక్కసారి కూడా హాజరు కాలేదన్న విషయం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న భారతి.. భారీ ఎత్తున జీతాలు తీసుకుంటున్న వైనం బయటకు వచ్చింది. భారతి సిమెంట్స్ లో జగన్ సతీమణికి అసాధారణ స్థాయిలోజీతాలు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
భారతి సిమెంట్స్ లో మెజార్టీ వాటా అంటే 51 శాతం ఉన్న పర్ ఫిసిమ్ కంపెనీ డైరెక్టర్లు.. ప్రొఫెషనల్ డైరెక్టర్లు కంటే ఎక్కువ జీతాన్ని భారతి తీసుకోవటం గమనార్హం.
భారతి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఛైర్ పర్సన్ కాక ముందే ఆమె క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వేతనం వచ్చేది. 2006-07లో రూ.17.5లక్షలు.. 2007-08లో రూ.42లక్షలు..
2008-09లో రూ.43.5లక్షలు.. రూ.2009-10లో రూ.42లక్షల వార్షిక వేతాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో సండూర్ పవర్ నుంచి 2005-06లో 11 లక్షలు, 2006-07లో 6 లక్షలు చొప్పున జీతం లభించింది. ఇదిలా ఉంటే.. 2010 డిసెంబరు 12న భారతి సిమెంట్స్ కు ఛైర్ పర్సన్ గా భారతి బాధ్యతలు స్వీకరించారు. సిమెంట్ రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా ఆమెకు అసాధారణరీతిలో రూ.3.90కోట్ల వార్షిక వేతనాన్ని ఇవ్వటం విశేషం.
అంతేనా.. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మెజార్టీ షేర్లు ఉన్న కంపెనీకి చెందిన ప్రొఫెషనల్ డైరెక్టర్లకు భారతి జీతంలో సగం మాత్రమే ఇచ్చినట్లుగా బయటకు వచ్చిన వివరాలు సంచలనంగా మారాయి. ఇదంతా చూసినప్పుడు కంపెనీల్లో భారతికి ఏం సంబంధం అంటూ జగన్ రాసిన బహిరంగ లేఖ కాస్తంత కామెడీగా అనిపించట్లేదు?
SOURCE:GULTE.COM