‘గీతాంజలి’లో ఆ మార్పు ఆయన వల్లేనట..
విభాగం: సినిమా వార్తలు
how-nag-fan-suggested-to-change-geethanjali-climax_g2d

ఒక స్టార్ హీరో అభిమాని చనిపోతే.. ఒక సెలబ్రెటీ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగడం.. జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం.. హ్యాష్ ట్యాగ్ పెట్టి అభిమానులంతా నివాళి అర్పించడం.. ఆ హీరో కుటుంబ సభ్యులు కూడా సంతాపాన్ని ప్రకటించడం అరుదుగా జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమాని రవీందర్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది. 

అక్కినేని అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. ఏఎన్నార్ వీరాభిమానిగా రవీందర్ రెడ్డి ఇండస్ట్రీ జనాలకు బాగానే పరిచయం. అభిమాని అంటే ఎక్కడో దూరంగా ఉండిపోకుండా.. అక్కినేని కుటుంబానికే చాలా ఆప్తుడిగా మారాడు రవీందర్. అక్కినేని ఫ్యామిలీ సినిమాల విషయంలో జోక్యం చేసుకునేంతగా అతను ఆ కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. 
అక్కినేని హీరోల సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరిగినా ఆయన పాత్ర ఉండాల్సిందే. తమ అక్కినేని కుటుంబం అతడిని తమలో ఒకడిగానే చూస్తూ వస్తోంది దశాబ్దాలుగా.

అలాంటి అభిమాని రెండు రోజుల కిందట తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక సన్నిహితుడిని కోల్పోయినట్లుగా బాధ పడుతూ ట్విట్టర్లో నివాళి అర్పించాడు. తమ కుటుంబంతో రవీందర్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మరోవైపు అక్కినేని అభిమానులు ‘రిప్ రవీందర్ రెడ్డి’ హ్యాష్ ట్యాగ్ తో అతడికి నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డికి సంబంధించిన ఒక ముఖ్య విషయం వెలుగులోకి వచ్చింది. నాగార్జున కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘గీతాంజలి’ క్లైమాక్స్ విషయంలో అతను కీలక మార్పు చేశాడట. నిజానికి ఈ చిత్రంలో హీరో హీరోయిన్లిద్దరూ చనిపోయేట్లుగా దర్శకుడు మణిరత్నం క్లైమాక్స్ ప్లాన్ చేశాడట. ఐతే తెలుగు ప్రేక్షకులు విషాదాంతాల్ని తట్టుకోలేరని మణిరత్నంకు గట్టిగా చెప్పి.. ‘వీళ్లు ఎంత కాలం బతుకుతారో తెలియదు. కానీ బతికినంత కాలం ఒకరికి ఒకరుగా సంతోషంగా ఉంటారు’ అనే డైలాగ్ తో సినిమా ముగిసేలా చేసింది రవీందర్ రెడ్డేనట. ఒక అభిమాని ఇలా సినిమాలో కీలక మార్పు చేయగలిగే స్వేచ్ఛ ఇచ్చారంటే అది అక్కినేని ఫ్యామిలీ గొప్పదనాన్ని సూచిస్తుంది.

 

 

SOURCE:GULTE.COM

27 Aug, 2018 0 357
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved