
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే అలవాటు ఉందా? హైదరాబాద్ మెట్రో రైల్లో జర్నీ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ.. అలాంటి ప్లాన్ ఉందా? అయితే.. మీరిది కచ్ఛితంగా చదవాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లుపడొచ్చు. ఇంతకీ విషయం ఏమంటే.. మెట్రో రైళ్లల్లో మహిళలకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే జరిమానా విధించనున్నట్లుగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు.
తాజాగా ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. మహిళలు..సీనియర్ సిటిజన్లు.. వికలాంగులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో ఇతరులు ఎవరైనా కూర్చుంటే రూ.500 వరకుజరిమానా విధించనున్నట్లుగా వెల్లడించారు.
ఇకపై మెట్రోరైళ్లలో ఎల్ అండ్ టీ భద్రతా సిబ్బంది.. పోలీస్ నిఘాను పెంచనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. మహిళా ప్రయాణికులు తమకు ఎదురయ్యే ఇబ్బందులను.. అసౌకర్యాలను తెలియజేసేందుకు వీలుగా ఒక వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేయాలన్న సూచనకు సానుకూలంగా స్పందించారు. సో.. మెట్రో రైల్లో ప్రయాణించే వారు.. మహిళలకు కేటాయించిన సీట్లు ఖాళీగా ఉన్నా.. వికలాంగులు.. వృద్ధులకు కేటాయించిన సీట్లు ఖాళీగా ఉన్న కూర్చొవద్దు. ఒకవేళ కూర్చుంటే జేబుకు ఫైన్ల రూపంలో చిల్లుపడటం ఖాయం. సో.. బీకేర్ ఫుల్.
SOURCE:GULTE.COM