పోరాటం చెయ్యడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా వుంటాను - శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
విభాగం: రాజకీయ వార్తలు
i-am-always-ready-for-battle-says-pawan_g2d

హైదరాబాద్ మాదాపూర్ లో గల జనసేన పార్టీ కార్యాలయం నందు తూర్పు గోదావరి జిల్లా నుండి కొత్తగా పార్టీలోకి చేరిన నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. 

* కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేమని అంబేద్కర్ గారు చెప్పిన మాటను బాగా నమ్మి, అర్ధం చేసుకున్నవాడిని కాబట్టి నేను ఎప్పుడూ కులాల ఐక్యత గురించి మాట్లాడుతాను. 

* కులాలను వాడుకుని వ్యక్తులు, కుటుంబాలు ఎదుగుతున్నాయి తప్ప కులాలు కాదు. 

* రాజబాబు గారి లాంటి నాయకత్వం జనసేన పార్టీకి ఉండాలి. అలాంటి నాయకులకు నేను అండగా వుంటా..వెంకటస్వామి నాయుడు గారు కూడా ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చారు. బలంగా పనిచేసే నాయకులను ఖచ్చితంగా గుర్తిస్తాను.

* నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు. ఆయన శ్రమ శక్తి మీద దోపీడీ ఎలా జరుగుతుంది అని కవిత చెప్పారు. బడుగుబలహీన వర్గాలు గాని, వెనుకబడ్డ వారు గాని పడ్డ శ్రమకు సరైన ప్రతిఫలం దక్కకపోతే వారు వెనుకపడిపోతారు. 

* అందరికీ సామాజిక న్యాయం జరగాలి. నాయకులు అధికారంలో కూర్చోవడం కాదు, అక్కడ కూర్చున్నవారు అందరికీ న్యాయం చెయ్యాలి.ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం వల్ల వలసలు పెరిగిపోయాయి.

* కేవలం ఓట్ల ప్రాతిపాదికతోనో, లేక ముఖ్యమంత్రి అయిపోదామనో అయితే నేను రాజకీయాలు వేరే వాడిలా చేసేవాడిని. ఇంత మంది యువత బలంగా ఉండి కూడా వారు  వెనుకబడిపోతున్నారు.ఏమీ ఆశించనోడే వారికి న్యాయం చెయ్యగలడు. 

* నేను ప్రజలను డబ్బులు అడగను, ప్రజలకు ఆశయాలు నచ్చితే వారే విరాళాలు అందిస్తారు, నాకు దీనికి కాన్షిరాం గారు ఆదర్శం, అందుకే నేను పనిచేసుకుంటూ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను. 

* నేను రాత్రికి రాత్రి ఎదో జరిగిపోతుంది అని అనుకోను, అందుకనే నేను ఆచి తూచి పార్టీని నిర్మిస్తున్నాను, అందుకనే రాజా బాబు గారి లాంటి నాయకులను గుర్తించగలిగాను.

* ఒక భావజాలంతో పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు గుర్తిస్తారని నేను నమ్ముతాను. నాకు ముఖ్యమంత్రి అయిపోవాలని ఏమీ లేదు. 

* కాన్షిరాం గారు ఒక్కరే దేశంలో మారుమూలల తిరుగుతూ పని చేసుకుని వెళ్లిపోయారు. అందువల్ల ఈరోజున బహుజన్ సమాజ్ పార్టీని బలంగా నిలబెట్టగలిగారు.

* ఒక సారి దెబ్బతిన్న తర్వాత ప్రాక్టికల్ గా నేను ఎందుకు ఉండను? వుంటాను. నా గురించి నేను ఎక్కువ ఊహించుకొను. ప్రజలకు ఉపయోగపడే రాజబాబు గారి లాంటి నాయకులను గుర్తించాల్సిన అవసరం వుంది, నేను గుర్తిస్తా...

* బలమైన నాయకులు లేకపోతె ఆశయాలను తీసుకువెళ్ళలేము. అందువల్ల కచ్చితంగా నేను నాయకులను గుర్తిస్తాను. 

* ఈరోజున జనసేన లేకపోతె వెనుకబాటుతనం మీద, జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి ఎవరూ ఉండేవారు కాదు. ఉద్దానం, తుమ్మపాల మీద ఎవరూ మాట్లాడేవారు కాదు. 

* ఓక రాజకీయ పార్టీని డబ్బు లేకుండా, అండదండలు లేకుండా, ఒకసారి దెబ్బ తిన్న తర్వాత కూడా పార్టీ పెట్టాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద, అసమానతల మీద ఎదురు తిరగాలి, నిలదీయాలి అనే ఒక బలమైన ఆకాంక్ష నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేసింది. 

* ఈరోజు తెలంగాణాలో బీసీలు అందరూ ఓసీ లు అయిపోయారు, దీని గురించి మాట్లాడే వారు లేరు. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పే వారు ఇలాంటి వాటి గురించి ఎందుకు ఆలోచించలేదు.

* భారతదేశం లో అభివృద్ధి ఫలాలు పై వర్గాలకు తప్ప కింది వర్గాలకు అందటం లేదు, వారు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఆశయంతో పనిచేస్తాం.

* సాటి మనిషి కన్నీళ్లు, కష్టాలు చూస్తే ఏడిచే శక్తి నాకు వుంది. అందరూ కలిసొస్తే తప్ప నేను సమస్యకు పరిష్కారం వెతకలేను. 

* నేను వయసులో ఉండగా అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానే కానీ, 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసులో రాలేదు. 25 కోట్లు పన్ను కట్టే వృత్తిని వదులుకొని వచ్చాను.

* వెనుకబడిన కులాల వారిలో చదువుకుని, కెపాసిటీ ఉండి పరిశ్రమలు పెట్టాలన్నప్పుడు ప్రభుత్వాలు సరైన సహాయం అందించకపోతే వారికి గుర్తింపు ఎలా వస్తుంది? వారి కులాలు ఎలా పైకి వస్తాయి. అలాంటి వారిని జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి వారికి అండగా ఉంటుంది. 

* దెబ్బ తగిలినా గాని పోరాటం చెయ్యడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా వుంటాను. ఏ ఆశయాలతో అయితే జనసేన వచ్చిందో వాటిని సాధించేవరకు నా తుది శ్వాస వరకు నేను అండగా ఉంటా..

 

 

 

SOURCE:JANASENA.ORG

 

13 Sep, 2018 0 377
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved