మానవత్వానికి నేను అండగా ఉంటా గాని కులాలకి కాదు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విభాగం: రాజకీయ వార్తలు
i-will-stand-behind-humanity-not-caste-says-pawan_g2d


జనసేన పోరాటయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో గల మార్టేరు సెంటర్ నందు నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం : 

 

* దారి పొడుగునా హారతులు ఇస్తూ గణ స్వాగతం పలికిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

* ఒక బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు దేశంలో ఉండాలి, సమకాలీన రాజకీయాలు, జవాబుదారీతనం ఉండాలని నేను రాజకీయాల్లోకి వచ్చా. మన దేశానికి, సమాజానికి ఏదోకటి చెయ్యాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను.

* మిగతా రాజకీయ నాయుకులలా సరదా కి రాలేదు, బాధ్యతతో కూడి నేను రాజకీయాల్లోకి వచ్చా..

* 2014లో జనసేన ఆఫీస్ కి వచ్చిన ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం నాయకులను అడిగితే జనసేన అజెండా ఏంటో పితాని సత్యనారాయణ గారికి తెలుస్తుంది.

* ఓట్లు చీలకూడదు, ఒక బలమైన నాయకుడు కావాలి, చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చా...

* 2014 తెలుగుదేశం గెలవాల్సిన పార్టీ కాదు. మీరు ఎవరి వల్ల గెలిచారో మీ ముఖ్యమంత్రి గారిని అడిగేతే పితాని గారికి తెలుస్తుంది.

* తెలుగుదేశం వాళ్ళు చేసిన ఇసుక దోపీడీల మీద ప్రశ్నిస్తే మమ్మల్ని ద్రోహులు అంటున్నారు. జనసేన ప్రజా సంక్షేమం కొరకు వచ్చింది గాని, తెలుగుదేశం సంక్షేమానికి కాదు.  

* 30 సంవత్సరాల నుండి భీమవరం డంపింగ్ యార్డ్ అద్వానంగానే వుంది, అక్కడ ప్రజలు ఎలా బతుకుతారు.

* అన్నపూర్ణ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో తాగడానికి నీళ్లు కరువయ్యాయి. వరి దిగుబడి తగ్గి రొయ్యల ఎగుమతి పెరిగింది. దీని వల్ల డబ్బులు వస్తున్నాయి గాని పర్యావరణం కాలుష్యమవుతుంది.

* ఈరోజుకీ 50 కోట్లు పెట్టి తెలుగుదేశం వారు ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయారు. వీటి గురించి మాట్లాడితే పితాని గారు జనసేన కి అనుభవం లేదు అంటున్నారు. ప్రశ్నిస్తే బాధపడి మమ్మల్ని తిడితే ఎలా పితాని గారు?

* మీ ఇసుక దోపీడీల గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. వాళ్లకి అనుకూలంగా మాట్లాడితే జనసేన చాల మంచిది లేకపోతె వేరే పార్టీ తొత్తు అంటారు.

* రెండు పాచిపోయిన లడ్డులు తీసుకుంది తెలుగుదేశమా? జనసేనా? మీరు తీసుకుని జనసేన బీజేపీ తొత్తు అంటున్నారు.

* తెలంగాణాలో ఒక అబ్బాయి నువ్వు ఆంధ్రావాడివి, వెళ్ళిపో అంటే ఆ అబ్బాయి వచ్చేసాడు. ఎవరో చేసిన తప్పులకి మనం క్షోభ అనుభవిస్తున్నాం.

* ఇప్పుడు కనుక రాజకీయాలను సరిచేయకపోతే యువత నాశనం అయిపోతారు అని తెలిసి ఈరోజున నేను రాజకీయాల్లోకి వచ్చాను.

* నేను ప్రజా సంక్షేమం కొరకు వచ్చా, భావితరాల కోసం వచ్చా. మీరు నన్ను తిట్టినా నేను ప్రజా సంక్షేమం కొరకు వచ్చాను. నేను ఒక కులాన్ని నమ్ముకుని రాలేదు, అందరికీ సమన్యాయం చెయ్యడానికి వచ్చాను. 

* ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జనసేన జెండాలు ఎన్ని వున్నాయి అని కూడా చెప్పే కేమెరాలు వున్నాయంటారు. అలా అయితే ఇసుక దోపిడీలు, అవినీతి కూడా కనపడుతుంది, తెలుస్తుంది కానీ తెలిసి కామ్ గా వుంటున్నారు.

* 2019 లో పవన్ కళ్యాణ్ వెనుక చిన్న పిల్లలు వుంటారు అన్నారు, ఆ చిన్న పిల్లలే ఇప్పుడు పెద్దవాళ్ళు. నేను ఈ ఒక్క తరం కోసం మాత్రమే రాలేదు, రాబోయే తరాల కోసం కూడా వచ్చా.

* పితాని గారు పెద్ద నాయకులు. ఇక్కడ ప్రజలకు పట్టాలు పంచారు గాని, స్థలాలు పంచలేదు. ఈ సమస్య మీ ముందుకు తీసుకు వస్తున్నా..

* పితాని గారు మీరు తిట్టినా, ఎమన్నా పడతాం...కానీ కొట్టిన బంతిలా కింద నుండి పైకి లేచి తీరుతాం.

* ఆగష్టు 14,15,16 రోజుల్లో జనసేన మేనిఫెస్టో తెలుపుతాం. నాకు కులం.. మతం లేవు, నేను అందరివాడిని. నా జీవితంలో కులాల గురించి మాట్లాడాల్సి వస్తాది అని అనుకోలేదు.

* యువత రకరకాల ఉత్సాహాల్లో పడిపోవడం వల్ల రాజకీయ నాయకులు దోచేసుకుంటున్నారు. దోపిడీని అరికట్టడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా.

* ఏ కులానికైనా, మతానికైనా అభివృద్ధి సమానంగా జరగాలి. కొన్ని కుటుంబాలకి మాత్రమే డబ్బు, అభివృద్ధి చెందుతున్నాయి.

* రిజర్వేషన్లు ఆడపడుచులకు, చిన్నారులకి ఇవ్వాలి. ప్రతీ గ్రామంలో దేవతలను పూజిస్తాం కానీ మహిళలను గౌరవించం. జనసేన, మహిళా రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా మాట్లాడుతుంది.

* ఆడపడుచుల ఆవేదన, తల్లుల ఆవేదన అర్ధం చేసుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. జనసేన పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్లకు కట్టుబడి వుంది, ఇది మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం.

* జనసేన సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచనా విధానం. ఒక కులానికి సంబంధించి ప్రత్యేక రక్తం ఉండదు. అందరి అవయవాలు, రక్తం ఒక్కటే.

* ఒక నియోజకవర్గానికి 25 కోట్లు ఎన్నికలలో ఖర్చుపెట్టాలని ఆలోచిస్తున్నారంటే తెలుగుదేశం వారికి అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది. వాళ్ళ ఆస్తులు పెంచుకుని, చెత్త మన ఇంటి ముందు వేస్తున్నారు.

* ముఖ్యమంత్రి గారిని ఉద్యోగాలు ఏవని అడిగితే మా అబ్బాయికి ఇచ్చాం కదా అంటారు. మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తే అందరికీ ఇచ్చినట్టు కాదు ముఖ్యమంత్రి గారు.

* తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారు మరి బీసీలు తెలంగాణాలో ఎక్కువ వున్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు నిలబడలేకపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీలో గల కొన్ని బీసీ కుటుంబాలు మాత్రమే లబ్ది పొందుతున్నాయి, తప్ప అన్నీ కాదు.

* ఉత్తరాంధ్రలో వున్న బీసీలు అందరూ జనసేన వెనుక వున్నారు. దానికి కారణం తెలుగుదేశం వాళ్ళని దోపిడీ చేసారు కాబట్టి.

* కచ్చితంగా బీసీ కులాలకు రిజర్వేషన్ల పెంచాల్సిన అవసరం వుంది. 

* స్వర్గం తల్లి పాదాల దగ్గర వుంది అని నేను భీమవరం ముస్లిం సోదరుల దగ్గర నుండి తెలుసుకున్నా..

* అధికారం, అభివృద్ధి కొందరి చుట్టే తిరుగుతుంది. చంద్రబాబు గారు, జగన్ మోహన్ గారి కుటుంబాల చుట్టూనే తిరుగుతుంది.

* 2009లో బీసీ లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో నేను ముఖ్యపాత్ర పోషించాను. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.

* ముఖ్యమంత్రి గారికి కాపుల రిజర్వేషన్లు చేయగలిగితేనే చెప్పండి అని నేను చెప్పి వారి మీద సందేహ పడ్డా, లేదు..లేదు మేము చేస్తాం అని ముఖ్యమంత్రి గారు అన్నారు. నా సందేహమే నిజమయ్యింది.

* మానవత్వానికి నేను అండగా ఉంటా గాని కులాలకి కాదు.

* ఈ దేశంలో సత్యం మాత్రమే గెలుస్తుంది. అందుకు నేను సత్యం మాత్రమే మాట్లాడతా...ఏ ఒక్క కులాన్ని నేను వెనకేసుకు రాను. 

* అన్ని కులాలు చూస్తేనే  జనసేన వుంది, ఏ ఒక్క కులం చూస్తేనో జనసేన లేదు. అన్ని కులాలు కలిస్తేనే జనసేన, పవన్ కళ్యాణ్..

 

 

SOURCE:JANASENA.ORG

12 Aug, 2018 0 415
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved