కొత్త ట్రైలర్ అదిరిపోయిందిగా..
విభాగం: సినిమా వార్తలు
imaikkaa-nodigal-official-trailer_g2d

రెండేళ్ల కిందట తెలుగులో ‘డిమాంటి కాలనీ’ పేరుతో ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ హార్రర్ మూవీ తెలుగులో జనాలకు అంతగా చేరువ కాలేదు కానీ.. తమిళంలో మాత్రం ఇది పెద్ద హిట్టయింది. కొత్త కథతో పరిమిత బడ్జెట్లో చాలా బాగా తీర్చిదిద్దాడు ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడైన అజయ్ జ్ఞానముత్తు. 

ఆ దర్శకుడి ఇప్పుడు క్రేజీ కాంబినేషన్లో ఒక థ్రిల్లర్ మూవీ తీశాడు. ఆ సినిమా పేరు.. ఇమైక నోడిగల్. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంతోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా తమిళ తెరకు పరిచయం కాబోతుడటం విశేషం. ఇందులో ఆమెకు జోడీగా అధర్వ నటించాడు. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించాడు.

ఇది ఒక సైకో చుట్టూ తిరిగే కథ. అతడికి మనుషుల్ని చంపడం సరదా. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు. చాలా క్రూరంగా మనుషుల్ని చంపుతున్న అతను పోలీసులకు ఫోన్ చేసి మరీ దమ్ముంటే తనను పట్టుకోండని సవాలు విసురుతాడు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసాఫీసర్ పాత్రలో నయన్ నటిస్తోంది. ట్రైలర్ చూస్తే సినిమాలో సూపర్ క్వాలిటీ కనిపిస్తోంది. 
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కశ్యప్ పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణ అయ్యేలా ఉంది. నయన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. రాశి ఖన్నా అందంగా కనిపించి ఆకట్టుకుంటోంది. ఇలాంటి సైకో కథలు ఇంతకుముందు కూడా చూశాం కానీ.. దీని ట్రీట్మెంట్ కొత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది. టాప్ క్లాస్ థ్రిల్లర్లా కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమయ్యే అవకాశముంది.

 

SOURCE:GULTE.COM

30 Jun, 2018 0 656
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved