
పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో గల రేలంగి గ్రామంలో జనసైనికులు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ కలవకొలను తులసీరావు గారు మరియు జనసేన మహిళా నాయకురాలు శ్రీమతి వసంతాల ప్రభావతి గారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొని, ఆరోగ్యం పట్ల ప్రజలు ఎటువంటి శ్రద్ధలు తీసుకోవాలో సూచించారు. ముఖ్య అతిధి తులసీరావు గారు మాట్లాడుతూ పేద ప్రజలకు జనసేన పార్టీ మరియు జనసైనికులు ఎల్లప్పుడూ తోడు ఉంటారని, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా పేద ప్రజలకి సరైన సదుపాయాలు అందించి వారి జీవన విధానాన్ని మెరుగు పరచడమే అని తెలిపారు. ప్రభుత్వాలకు, నాయకులకు పేద వారి ఓట్ల మీద వున్న శ్రద్ధ పేద ప్రజల బాగోగులు చూసుకోవడం మీద ఉండదని ఎద్దేవా చేశారు. పేద వారి కోసం పుట్టిన జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ ఒక్కరి కుటుంబాలు అభివృద్ది చెందుతాయని, దీని కొరకై జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని తెలిపారు. ఇప్పటి వరకు పేద ప్రజల బతుకులతో ఆడుకున్న నాయకులకు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు.
మరొక ముఖ్య అతిధి ప్రభావతి గారు మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తదుపరి కార్యక్రమంలో పేద ప్రజలకు వైద్యుల సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన సూచనలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు మరియు ప్రజలు పాల్గొన్నారు
SOURCE:JANASENA