ప‌వ‌న్ చుట్టూ క‌నిపించ‌ని గోడ‌లు..
విభాగం: రాజకీయ వార్తలు
inside-talk-many-janasena-leaders-unhappy-with-pawan_g2d

పార్టీ పెట్ట‌టం పెద్ద గొప్ప విష‌యమేమీ కాదు. నీతులు.. సిద్దాంతాలు.. విలువ‌ల గురించి లెక్చ‌ర్లు ఇవ్వ‌టం క‌ష్ట‌మేమీ కాదు. చెప్పిన మాట‌ల్ని చేత‌ల్లో చూపించ‌ట‌మే అస‌లు సిస‌లు ఇబ్బంది అంతా. అదెంత క‌ష్ట‌మైన విష‌య‌మ‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇప్ప‌టికైనా తెలియ‌క‌పోవ‌టంపై జ‌న‌సేన‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ప‌వ‌న్ మీద ఇష్టంతోనూ.. ఆయ‌న చెప్పే మాట‌ల ప్ర‌భావానికి లోనైన వారు.. వెనుకా ముందు చూసుకోకుండా ఆయ‌న పార్టీలో చేరిపోతున్నారు. త‌మ‌ను క‌లిసిన‌ప్పుడు ప‌వ‌న్ చెప్పే మాట‌ల‌కు.. ప్రాక్టిక‌ల్ కు మ‌ధ్య అంత‌రం సంబంధం లేకుండా ఉంద‌ని చెబుతున్నారు. త‌న‌కు కులాలు.. మ‌తాలు అస్స‌లు ప‌ట్ట‌వ‌ని.. తాను వాటికి దూరంగా ఉంటానని  చెప్పే ప‌వ‌న్ తీరుకు భిన్న‌మైన పరిస్థితులు పార్టీలో ఉన్నాయ‌ని చెబుతున్నారు.

జ‌న‌సేన పేరుతో 2014లో పార్టీని ప్ర‌క‌టించిన ప‌వ‌న్.. ఈ మ‌ధ్య‌నే పార్టీకి సంబంధించి కొన్నిక‌మిటీల‌ను వేయ‌టం.. పార్టీకి సంబంధించిన పనులు చూసేందుకు వీలుగా కొంద‌రిని ఎంపిక చేసుకోవ‌టం జ‌రిగింది. ఇదంతా బాగానే ఉన్నా.. అలా ఎంపిక చేసుకున్న వారిలో 80 శాతం వ‌ర‌కూ ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన వార‌న్న షాకింగ్ మాట వినిపిస్తోంది. కులాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌ని ప‌వ‌న్‌.. తాను జ‌రిపిన నియామ‌కాల్లో ఒకే సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేయ‌టం అనుకోకుండా జ‌రిగిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

మ‌రోవైపు.. పార్టీ కోసం ప‌ని చేస్తున్న వారిలో అస‌హ‌నం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ ఏడు జిల్లాల‌కు బాధ్యుల్ని ప్ర‌క‌టించారు. ఉత్త‌రాంధ్ర‌లో మూడు జిల్లాల‌తో పాటు రెండు గోదావ‌రి జిల్లాలు.. కృష్ణా.. గుంటూరు జిల్లాల‌కు క‌న్వీన‌ర్లు.. జాయింట్ క‌న్వీన‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. మిగిలిన జిల్లాల‌కు బాధ్యుల్ని త్వ‌ర‌లో ఎంపిక చేస్తార‌న్న మాట వినిపిప‌స్తోంది.

2014 నుంచి పార్టీ కోసం ప‌ని చేసిన వారిని ప‌ట్టించుకోకుండా.. త‌మ‌కు సంబంధం లేని వారిని.. కార్పొరేట్ వ‌ర్గానికి చెందిన వారికి..వ్యాపారుల‌కు ప‌ద‌వులు ద‌క్క‌టాన్ని జ‌న‌సైనికులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. జ‌న‌సేన‌లో యాక్టివ్ గా ప‌ని చేసిన వారిని కాద‌ని.. ప్ర‌జారాజ్యంలో ప‌ని చేసిన వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌టంపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. 

ఏళ్ల‌కు ఏళ్లుగా ప‌వ‌న్ ను న‌మ్మ‌కొని.. వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓరిస్తే.. వేరే వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ఏమిట‌న్న ఆవేద‌న ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.  త‌మ ఆవేద‌నను ప‌వ‌న్ తో పంచుకోవ‌టానికి హైద‌రాబాద్ కు వ‌చ్చిన నేత‌ల‌కు. . ప‌వ‌న్ ద‌ర్శ‌నం ల‌భించ‌టం లేద‌ని.. ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా క‌నిపించ‌ని గోడ‌లు అడ్డుగా నిలుస్తున్న‌ట్లు చెబుతున్నారు. నీతులు చెప్పే ప‌వ‌న్.. తొలుత త‌న పార్టీలో త‌న‌కు సైతం క‌నిపించ‌కుండా ఉన్న గోడ‌ల్ని బ‌ద్ధ‌లు కొడితే మంచిందంటున్నారు. ఆ ప‌ని చేసిన త‌ర్వాత రాజ‌కీయాల గురించి మాట్లాడితే బాగుంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. 

 

 

SOURCE:GULTE.COM

16 Aug, 2018 0 355
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ 2022 galli2delhi.com All Rights Reserved
@ 2022 galli2delhi.com All Rights Reserved