జగన్ సర్కారు నిద్ర పోతుందా ... మాటలలో కాదు చేతలలో చూపాలని CBN సవాల్
విభాగం: రాజకీయ వార్తలు
is-jagan-government-is-sleeping-...not-in-words-but-show-in-deeds-cbn_g2d

ఆంధ్రప్రదేశ్ లో కరోనా క్వారంటైన్ సెంటర్లలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  ఆక్రోశం వ్యక్తం చేసారు.
ఆకలి అవుతున్న అన్నం కూడా పెట్టడం లేదు. బయట నుండి అన్నం తెచ్చుకుందామంటే సెక్యూరిటీ వాళ్ళు లంచం అడుగుతున్నారు . ట్యాబ్లెట్లు కావాలని, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చివరి మూడు రోజులుగా అడుగుతున్నాo ఎన్నిసార్లు అడిగినా  ఎవరూ పట్టించుకోవడం లేదు. చనిపోయిన వాళ్ళ విషయం లో చాలా దారుణంగా వ్యవహరించారు. క్వారంటైన్ సెంటర్లలో ఒక్కో పేషెంట్ మీద ప్రభుత్వం వేల రూపాయిలు ఖర్చు చేస్తుంది. టాయిలెట్ కు పోదామంటే బకెట్లు లేవు , మరుగుదొడ్లు శుభ్రపరచడం లేదు. క్వారంటైన్ లో పెట్టి మమ్మల్ని చంపేస్తారా అంటూ పేషెంట్లు ఆందోళన చేస్తున్నారు .
బాబూ మమ్మల్ని ఏం చేయమంటారు? పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు అందర్నీ నేనొక్కదాన్నే చూసుకోవాలి. నాక్కూడా భర్త, పిల్లలు ఉన్నారు. శక్తికి మించి పని చేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని పట్టించుకోకుంటే నేనేం చెయ్యాలి. అలాంటిది మీరు మా మీద ఫైర్ కావడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అంటూ సిబ్బంది వివరణ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా క్వారంటైన్ సెంటర్లలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలివి అంటూ ప్రతిపక్ష నేత TDP చంద్రబాబు షేర్ చేసిన ఈ వీడియో యుట్యూబ్ లో సంచలనంగా మారింది.కరోనా కట్టడికి వేలకోట్లు ఖర్చు చేస్తూ జగన్ సర్కార్ చేస్తున్న భాగోతమిది అంటూ TDP శ్రేణులు ఈ వీడియో ను వైరల్ చేసారు

21 Jul, 2020 0 260
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
అభిప్రాయం
@ galli2delhi.com All Rights Reserved
@ galli2delhi.com All Rights Reserved